Saidharam Tej: మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కు జరిగిన రోడ్డు ప్రమాదం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పట్లో ఈ వార్త పెను సంచలనాన్నే సృష్టించింది. దేవుడి దయ వలన తేజ్ బతికి బయటపడ్డాడు. ఆరు నెలల బెడ్ రెస్ట్ తరువాత తేజ్ బయటికి వచ్చాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. యాక్సిడెంట్ తరువాత తేజ్ నుంచి వస్తున్న చిత్రం విరూపాక్ష. కార్తీక్ దండు దర్శత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను బివిఎస్ ఎన్ ప్రసాద్ తో కలిసి సుకుమార్ నిర్మిస్తున్నాడు. ఇక నేడు ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో రిలీజయిన ఈ గ్లింప్స్ ఆకట్టుకొంటుంది.
చివర్లో తేజ్ ఫస్ట్ లుక్ కూడా అదిరిపోయింది కానీ, తేజ్ ను వెంటనే గుర్తుపట్టలేకపోతున్నాం అంటున్నారు అభిమానులు. అంతకుముందున్న కళ ఫేస్ లో లేదని చెప్పుకొస్తున్నారు. యాక్సిడెంట్ తరువాత తేజ్ లో చాలా మార్పులు వచ్చాయి. ముఖం మొత్తం పీక్కుపోయింది.సన్నబడ్డాడు.. ఇప్పుడు టైటిల్ ఫస్ట్ లుక్ లో కూడా అలానే కనిపిస్తున్నాడు. యాక్సిడెంట్ ను నుంచి కోలుకున్న వెంటనే తేజ్ ఈ సినిమాను మొదలుపెట్టడంతో అదే లుక్ లో కంటిన్యూ అయిపోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తేజ్ కోలుకుంటున్నాడు. మళ్లీ తేజ్ మునపటి రూపానికి ఎప్పుడొస్తాడో చూడాలి.