Sai Srinivas : బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చకు తెరలేపాయి. సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ కలిసి నటిస్తున్న మూవీ భైరవం. ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మే 30న వస్తున్న ఈ సినిమాకు భారీగా ప్రమోషన్లు చేస్తున్నారు. తాజాగా సుమతో ఓ ఇంటర్వ్యూ చేశారు ఈ ముగ్గురు హీరోలు. ఇందులో పెళ్లి గురించి సాయి శ్రీనివాస్ ను సుమ ఓ ప్రశ్న వేస్తుంది. ఆమె ప్రశ్న వేయగానే.. పక్కనే ఉన్న డైరెక్టర్ మాట్లాడుతూ.. ‘మీరు అలా అడిగితే నాకేం తెలియదు మా డాడీకే తెలుసు అంటాడు’ అని చెప్పాడు.
Read Also : OG : ఓజీ అప్డేట్.. పవన్ షూట్ లో పాల్గొనేది అప్పటి నుంచే..
ఇంకోవైపు మనోజ్ కూడా.. ‘తమ్ముడు నువ్వు రోజూ ఉదయాన్నే అన్నీ మర్చిపోతున్నావ్ కదా.. నీకు అన్ని పెళ్లిళ్లు ఎందుకు’ అంటూ నవ్వేశాడు. చివరకు సాయి శ్రీనివాస్ స్పందిస్తూ.. కొందరు హీరోలను చూస్తుంటే వాళ్ల లాగే రెండు, మూడు పెళ్లిళ్లు చేసుకోవాలి అనిపిస్తుంది’ అన్నాడు. ఈ కామెంట్లే ఇప్పుడు పెద్ద రచ్చకు దారి తీస్తున్నాయి. కొందరు హీరోలు అంటే ఏ హీరోల గురించి అతను కామెంట్ చేశాడు అంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. మొత్తానికి సాయి శ్రీనివాస్ ఓ మంట పెట్టేశాడని కొందరు ట్రోల్స్ మొదలెట్టారు.
ఇప్పటి వరకు సాయి శ్రీనివాస్ ఏ హీరో గురించి నెగెటివ్ కామెంట్ చేయలేదు. ఇప్పుడు చేసింది కూడా సరదాగానే అంటూ ఆయన ఫాలోవర్లు కొందరు చెబుతున్నారు. కానీ ఇది ఇక్కడితో ఆగేలా కనిపించట్లేదు. భైరవం మూవీతో ఎలాగైనా హిట్ కొట్టాలని ఈ ముగ్గురూ ఎదురు చూస్తున్నారు. మరి వీరికి దాని రిజల్ట్ ఎలా వస్తుందో చూడాలి.
Read Also : Coolie : ‘కూలీ’ సినిమా తెలుగు రైట్స్ కొనేసిన నాగార్జున?