Sai Pallavi: సినిమా ఒక గ్లామర్ ప్రపంచం.. ఇందులో నెగ్గుకురావాలంటే ఉన్నంత కాలం గ్లామర్ ను మెయింటైన్ చేస్తూనే ఉండాలి. ఫిట్ నెస్, పార్లర్స్, జిమ్, డైట్.. అంటూ ప్రతి హీరోయిన్ తన బాడీని పర్ఫెక్ట్ గా ఉంచుకోవడానికి కష్టపడుతూనే ఉన్నారు. అయితే ఈ జనరేషన్ లో ఇవేమి చేయని ఏకైక హీరోయిన్ సాయి పల్లవి.. అవును ఇప్పటివరకు జిమ్ కు వెళ్లని ఏకైక హీరోయిన్ సాయి పల్లవి. ఈ విషయాన్నీ ఆమె స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
తన ఫిట్ నెస్ సీక్రెట్ కేవలం డ్యాన్స్ అని, నిత్యం డ్యాన్స్ చేయడం వలనే తాను ఫిట్ గా ఉంటానని తెలిపింది. ఇక ఇప్పటివరకు జిమ్ లోకి అడుగుపెట్టింది కూడా లేదని, అసలు తనకు ఏ రోజు ఆ అవసరం రాలేదని చెప్పింది. ఇక న్యాచురల్ గా ఉండడానికి కూడా ఆమె ఎటువంటి బ్యూటీ ప్రోడక్ట్ ను వాడదట. ఇంట్లో తన తల్లి చెప్పే చిట్కాలనే ఆమె ఎక్కువ పాటిస్తుందట. ఇక ప్రస్తుతం సాయి పల్లవి పలు సినిమాలతో బిజీగా మారింది. త్వరలోనే ఆమె నటించిన సినిమాలు రిలీజ్ కు సిద్ధమవుతున్నాయి.