సాయి పల్లవి… ఫిదా సినిమాతో తెలుగు తెరపై మెరసి ఫస్ట్ సినిమాతో సూపర్బ్ ఫేమ్ సంపాదించుకుంది. అందం, యాక్టింగ్ స్కిల్స్ పర్ఫెక్ట్ గా ఉండే సాయి పల్లవి తను చేసే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. లవ్ స్టొరీ, శ్యాం సింగ రాయ్, విరాట పర్వం లాంటి సినిమాల పేర్లు చూస్తే ఈ మధ్య కాలంలో ఏ హీరోయిన్ ఇంత పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న రోల్స్ పడలేదనే చెప్పాలి. చీర కట్టులో కూడా మోస్ట్ గ్లామరస్ గా కనిపించగల సాయి పల్లవికి తెలుగు రాష్ట్రాల్లో సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆమెని చూడడానికే ఆడియన్స్ థియేటర్స్ కి వెళ్తున్నారు అంటే సాయి పల్లవి క్రేజ్ ఏ రేంజులో ఉందో అర్ధం చేసుకోవచ్చు. లేడీ పవర్ స్టార్ అనే పేరు తెచ్చుకున్న సాయి పల్లవి ప్రస్తుతం సినిమాలకి కాస్త దూరంగా ఉంది.
సాయి పల్లవి చివరగా నటించిన విరాటపర్వం సినిమా 2022 జూన్ లో రిలీజ్ అయ్యింది అంటే గత రెండేళ్లుగా సాయి పల్లవి నుంచి సినిమా లేదు, ఆమె బయట కూడా కనిపించింది చాలా తక్కువ. ఎవరైనా హీరోయిన్ రెండేళ్లు కనపడకపోతే ఆమె మర్చిపోతారు ఆడియన్స్. కొత్త హీరోయిన్ ని క్రష్ లిస్టులో యాడ్ చేసుకోని, ఆమె ఫోటోస్ ని చూసి ఎంజాయ్ చేస్తుంటారు. సాయి పల్లవి విషయంలో మాత్రం అలా జరగట్లేదు, రెండేళ్లైనా ఆమె క్రేజ్ మాత్రం తగ్గట్లేదు. నాగ చైతన్యతో కలిసి తండేల్ సినిమా చేయడానికి రెడీ అయ్యింది సాయి పల్లవి. ఈ పాన్ ఇండియా మూవీ ఓపెనింగ్ సెరిమోనీకి వచ్చిన సాయి పల్లవి ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. చాలా సింపుల్ గా ఎప్పటిలాగే క్యూట్ లుక్స్ తో కనిపించిన సాయి పల్లవి ఫోటోలని ట్రెండ్ చేస్తూ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ మధ్య కాలంలో ఏ హీరోయిన్ కి ఇలాంటి క్రేజ్ దక్కలేదు. మరి తండేల్ నుంచైనా సాయి పల్లవి బ్యాక్ టు బ్యాక్ సినిమాలని చేస్తుందేమో చూడాలి.