Sai Pallavi Joins Naga Chaitanya NC23: యువ సామ్రాట్ నాగ చైతన్య చివరిగా అందుకున్న హిట్ సినిమా ఏది అంటే తడుముకోకుండా చెప్పే సమాధానం లవ్ స్టోరీ. ఆ తర్వాత ఆయన బంగార్రాజు అనే సినిమాతో ఒక మాదిరి హిట్ అందుకున్నా అది తండ్రితో కలిసి చేసిన సినిమా కావడంతో పూర్తిగా ఆయనకి క్రెడిట్ ఇవ్వలేం.ఆ తరువాత చేసిన థాంక్యూ.. లాల్ సింగ్ చద్దా, ఆ తరువాత చేసిన కస్టడీ కూడా దారుణమైన ఫలితాన్ని అందించాయి. ఒక రకంగా చెప్పాలంటే మజిలీ తరువాత ఆయన వెంకీ మామ చేసినా అది కూడా ఆయనకు పెద్దగా కలిసి రాలేదు. అంటే లవ్ స్టోరీ సినిమాలో ఆయనకు లేడీ లక్ గా సాయి పల్లవి కలిసొచ్చింది. ఇక ఇప్పుడు మరోసారి వీరిద్దరూ కలిసి నటిస్తూ ఉండడంతో ఆ లక్ కలిసి రావచ్చని భావిస్తున్నారు. నాగచైతన్య హీరోగా దర్శకుడు చందూ మొండేటి పాన్ ఇండియా లెవల్లో ఒక సినిమా చేస్తున్నారు. #NC23గా చెబుతున్న సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
Manchu Mohan Babu: అంత కోపం ఎందుకు మాస్టారూ.. పాపం జయసుధ..
దాదాపు నెల రోజుల క్రితమే ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభించిన టీమ్, త్వరలోనే సినిమా షూటింగ్‌ని ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తోండగా ఈ ప్రీ-ప్రొడక్షన్ వర్క్స్‌లో భాగంగా, నిన్న సినిమాలో హీరోయిన్ కూడా టీమ్‌తో జాయిన్ అయ్యారు. అయితే ఈ రోజు మేకర్స్ ఆమె ఎవరో వెల్లడించారు ఆమె ఇంకెవరో కాదు సాయి పల్లవి. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కనున్న ఈ ప్రతిష్టాత్మక సినిమాలో హీరోయిన్ గా టీంలో చేరారు. బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, తెలుగుతో పాటు హిందీలో అనేక కల్ట్ హిట్‌లను అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మాత అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. నాగచైతన్య, సాయి పల్లవి గతంలో సూపర్ హిట్ ‘లవ్ స్టోరీ’ చిత్రంలో కలిసి పనిచేయగా కొత్త సినిమాలో తమ అద్భుతమైన కెమిస్ట్రీతో మనల్ని ఉర్రూతలూగించబోతున్నారని అంటున్నారు. #NC23 నాగ చైతన్య, చందూ మొండేటి ఇద్దరికీ అత్యంత భారీ బడ్జెట్ చిత్రం కానుంది. సినిమాకి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను మేకర్స్ త్వరలో అనౌన్స్ చేస్తారు.