Sai Pallavi: ఇండియన్ సినిమాను ఏలుతున్న హైబ్రీడ్ పిల్ల!”
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్‌ను సంపాదించుకున్న ‘హైబ్రీడ్ పిల్ల’ సాయిపల్లవి, ఇప్పుడు మళ్ళీ ఫుల్ బిజీ అయిపోయింది. గ్లామర్ కంటే పర్ఫార్మెన్స్‌కే పెద్దపీట వేసే ఈ నేచురల్ బ్యూటీ, ప్రస్తుతం అన్ని భాషలనూ చుట్టేస్తోంది. మైథలాజికల్ నుంచి సైన్స్ ఫిక్షన్ వరకు.. జానర్ ఏదైనా సరే తనే బెస్ట్ అనిపించుకుంటూ వరుస క్రేజీ ప్రాజెక్టులను తన ఖాతాలో వేసుకుంటోంది. ‘అమరన్’ సినిమా వేడుకలో లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం సాయిపల్లవిని ఆకాశానికెత్తేశారు. “నేను నీకు పెద్ద ఫ్యాన్‌ని.. త్వరలో కలిసి పనిచేద్దాం” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నిజమవుతున్నట్లు తెలుస్తోంది. మణిరత్నం తన తదుపరి సినిమాలో సాయిపల్లవిని ఒక కీలక పాత్ర కోసం ఎంపిక చేశారని సమాచారం. మాస్టర్ డైరెక్టర్ మాట నిలబెట్టుకోవడంతో ఈ కాంబినేషన్ ఎలా ఉండబోతోందన్న ఉత్కంఠ ఫ్యాన్స్‌లో మొదలైంది.
Also Read:Spirit: డార్లింగ్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. ‘స్పిరిట్’లో డాన్ లీ క్యామియో? మార్చి 1న అప్‌డేట్ వస్తోందా!
Also Read
- Vijay Deverakonda : "వాళ్ల జోలికొస్తే నేను ఊరుకోను".. స్టేజ్ మీదే వార్నింగ్ ఇచ్చిన విజయ్ దేవరకొండ!
- Sandeep Reddy Vanga: ‘అప్పుడే అర్థమైంది..’ ఆనంద్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన సందీప్ రెడ్డి వంగా
- Raaka Remuneration: పుష్ప తర్వాత బన్నీ మార్కెట్ ఇదేనా? ‘రాకా’ రెమ్యునరేషన్ తెలిస్తే షాకే!
- Vaishnavi : విజయ్ దేవరకొండ గురించి వైష్ణవి ప్రస్తావన.. బావగారు అంటూ టీజ్ చేసిన ఆడియెన్స్.. బ్లష్ అయిన వైష్ణవి
ప్రభాస్ హీరోగా వచ్చిన ‘కల్కి 2898 AD’ సీక్వెల్‌లో ఒక మేజర్ చేంజ్ ఉండబోతోందని టాక్. మొదటి భాగంలో నటించిన దీపికా పదుకోణ్ స్థానంలో సాయిపల్లవిని తీసుకున్నట్లు ఫిల్మ్ నగర్ సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే, కల్కి లాంటి సైన్స్ ఫిక్షన్ మూవీలో సాయిపల్లవి నటన సినిమాకు ఒక కొత్త ఎనర్జీని ఇస్తుందనడంలో సందేహం లేదు. సాయిపల్లవి ప్రస్తుతం హిందీ చిత్ర పరిశ్రమలోనూ సత్తా చాటుతోంది. సాయిపల్లవి హిందీ డెబ్యూ మూవీ ‘ఏక్ దిన్’ మే 1వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది. రణబీర్ కపూర్ హీరోగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘రామాయణ’లో సాయిపల్లవి సీతగా నటిస్తోంది. ఈ పాత్ర కోసం ఆమె ఎంతో రీసెర్చ్ చేసి మరీ సిద్ధమైనట్లు తెలుస్తోంది.
Also Read:Heroines: స్టార్‌డమ్ ఇచ్చిన తెలుగు సినిమా అంటే హీరోయిన్లకు ఎందుకంత లోకువ?
కేవలం తెలుగు, హిందీ మాత్రమే కాదు.. తమిళంలోనూ సాయిపల్లవి బిజీగా ఉంది. స్టార్ హీరో ధనుష్ సరసన ఒక సినిమాలో కథానాయికగా నటిస్తోంది. ఇలా మైథలాజికల్ మూవీస్, సోషల్ డ్రామాలు, సైన్స్ ఫిక్షన్ చిత్రాలతో అన్ని భాషలనూ కవర్ చేస్తూ ఇండియన్ సినిమా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా సాయిపల్లవి దూసుకుపోతోంది. నేచురల్ యాక్టింగ్ తో ఇటు క్లాస్, అటు మాస్ ప్రేక్షకులను మెప్పిస్తున్న ఈ ముద్దుగుమ్మ, రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులను సృష్టించడం ఖాయం.
తాజావార్తలు
-
Story Board : పసిడి అమ్మకాన్ని ప్రోత్సహిస్తున్న కంపెనీలు.. సామాన్యుల బలహీనతలే టార్గెటా?
-
Israel: ఇజ్రాయెల్‌పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
-
Vijay Deverakonda : “వాళ్ల జోలికొస్తే నేను ఊరుకోను”.. స్టేజ్ మీదే వార్నింగ్ ఇచ్చిన విజయ్ దేవరకొండ!
-
OTR : కుప్పంలో పాత నేత మళ్ళి కీలక బాధ్యత లోకి రాబోతున్నారా?
-
Sandeep Reddy Vanga: ‘అప్పుడే అర్థమైంది..’ ఆనంద్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన సందీప్ రెడ్డి వంగా
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!