Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Sai Kumar Golden Jubilee In Acting

Golden Jubilee: డైలాగ్ కింగ్ యాభై యేళ్ళ నట ప్రస్థానం!

Published Date :October 20, 2022 , 2:01 pm
By Omprakash Vaddi
Golden Jubilee: డైలాగ్ కింగ్ యాభై యేళ్ళ నట ప్రస్థానం!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Golden Jubilee: డైలాగ్ కింగ్, అజాత శత్రువు సాయికుమార్ కు యాభై యేళ్ళు! అదేమిటీ ఆయన పుట్టింది 1960లో కదా అని కొందరికి అనుమానం రావచ్చు. బట్…. నటుడిగా ఆయనకు ఇది 50వ సంవత్సరం. పన్నెండేళ్ళ చిరు ప్రాయంలో తొలిసారి మయసభలోని దుర్యోధనుడి పాత్ర కోసం ముఖానికి రంగు వేసుకున్నారు సాయికుమార్. ఆ తర్వాత బాలనటుడిగా, యువ నటుడిగా, కథానాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా యాభై సంవత్సరాల పాటు వివిధ భాషల్లో వందలాది చిత్రాలలో నటించారు.

Read Also: RRR In Japan: జపాన్‌లో RRR క్రేజ్‌.. అస్సలు తగ్గడం లేదుగా..

తండ్రి పీజే శర్మ నుండి అబ్బిన నటనకు, వాచకానికి మెరుగులు దిద్దుకుంటూ ముందుకు సాగారు సాయికుమార్. ఓ పక్క సినిమాలలో చిన్న చిన్న పాత్రలు చేస్తూనే రాజశేఖర్, సుమన్ లకు డబ్బింగ్ చెప్పి, డైలాగ్ కింగ్ అనిపించుకున్నారు. ఇక ‘పోలీస్ స్టోరీ’ మూవీతో సాయికుమార్ సాధించిన సంచలన విజయం ఓ చరిత్ర. ఒకే ఒక్క సినిమాతో సాయికుమార్ జీవితమే మారిపోయింది. ఆ తర్వాత దాదాపు పాతిక చిత్రాలలో పోలీస్ పాత్రలు చేసి మెప్పించారు. వందలాది సినిమాలకు డబ్బింగ్ చెప్పారు. భాషా బేధం లేకుండా పలు చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తున్నారు. విశేషం ఏమంటే సాయికుమార్ తమ్ముళ్ళు కూడా సినిమా రంగంలోనే కొనసాగుతున్నారు. డబ్బింగ్ ఆర్టిస్టులుగా, నటులుగా రాణిస్తున్నారు. అలానే సాయికుమార్ కుమారుడు ఆది కూడా హీరోగా తెలుగు చిత్రసీమలో తనకంటూ ఓ మంచి స్థానాన్ని సంపాదించుకున్నాడు. కేవలం నటనకు మాత్రమే పరిమితం కాకుండా సాయికుమార్ ‘ఈశ్వర్ అల్లా’ వంటి సందేశాత్మక చిత్రాన్నీ నిర్మించారు. రాజకీయ రంగంలోకి అడుగపెట్టి, కన్నడనాట ప్రజా సేవకూ సిద్ధపడ్డారు. బీజేపీ లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. సినిమాలతో పాటు బుల్లితెర మీద ప్రత్యేక కార్యక్రమాలు చేస్తూ… తనదైన ముద్రను వేశారు. నటుడుగా గోల్డెన్ జూబ్లీ జరుపుకుంటున్న సాయికుమార్… మరింత గొప్ప పాత్రలను చేస్తూ… మరింత ఉన్న స్థితికి చేరుకోవాలని కోరుకుందాం.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • dialogue king sai kumar
  • Golden Jubilee Year in Acting
  • Police Story
  • Sai Kumar
  • Tollywood

తాజావార్తలు

  • Gopichand33: మ్యాచో స్టార్ గోపీచంద్ 33వ సినిమా అప్‌డేట్..

  • PM Modi: ఏకమవ్వాలి.. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు కోరుతూ ఎంపీలకు ప్రధాని మోడీ లేఖ

  • Asha Bhosle : మూగబోయిన గాన గంధర్వం.. లెజెండరీ గాయని ఆశా భోస్లే కన్నుమూత

  • SBI ATM: ఎస్‌బీఐ ఏటీఎంలలో భారీగా నగదు గల్లంతు.. ఏకంగా రూ.కోటి 20 లక్షలు

  • NTRNeel : విలన్‌గా బాలీవుడ్ స్టార్.. కానీ లుక్ మాత్రం..?

ట్రెండింగ్‌

  • Parenting Tips: తల్లిదండ్రులూ తస్మాత్ జాగ్రత్త! రిజల్ట్స్ వచ్చేశాయ్.. పిల్లల ప్రవర్తనను గమనించండి!!

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • Kitchen Tips : కిచెన్ వ్యర్థమే కాదు.. ఉల్లిపాయ పొట్టులో దాగుంది పవర్ తెలుసా.!

  • Paya Soup Health Benefits: పాయా సూప్‌లో దాగున్న ఆరోగ్య రహస్యం ఇదే.. అందుకే దీనికి అంత క్రేజ్‌..

  • Curry Leaves Side Effects: కరివేపాకుతో జాగ్రత్త..! ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తింటే ముప్పే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions