మెగా హీరో సాయిధరమ్ తేజ్ విరూపాక్ష తో సంచలన విజయం సాధించారు. ప్రస్తుతం తన తదుపరి చిత్రాల మీద ఫోకస్ పెట్టారు. ఇక ఈరోజు మరొక చిత్రం చక్రవ్యూహం – ది ట్రాప్ ( ఉప శీర్షిక ) ట్రైలర్ ను గ్రాండ్ రిలీజ్ చేసారు. విలక్షణ పాత్రలతో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న అజయ్ ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించారు.మిస్టరీ క్రైమ్ నేపథ్యంలో సాగే ఈ కథని మధుసూదన్ దర్శకత్వంలో శ్రీమతి సావిత్రి గారు సహస్ర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించారు. పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ పూర్తిచేసుకొని జూన్ 2 న థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది.
Read Also: Bunny Vas: ఈరోజు నేను అలా చేశాను కాబట్టే నాకు ఇలా జరుగుతుందేమో…
విరూపాక్ష చిత్రం లో అజయ్ పాత్ర నిడివి తక్కువే అయినా తన నటనతో మెప్పించారు. సినిమా సినిమాకి అందులో ఉన్న పాత్రకి తగ్గట్టు బాడీ లాంగ్వేజ్ మరియు హవా భావాలతో తగిన న్యాయం చేస్తూ ఎదిగిన నటుడు అజయ్ ఈ క్రైమ్ స్టోరీ లోను అదే రీతిన ప్రేక్షకుల మెప్పు పొందుతారు అనడం లో సందేహం లేదు. ట్రైలర్ లోకి వెళ్తే మొదటి నుంచి చివర దాక మొత్తం సస్పెన్స్ ని రేకెత్తిస్తూ సాగింది. ముఖ్యంగా బాక్గ్రౌండ్ స్కోర్ వాళ్ళ కథపై ఆసక్తి పెరిగింది. మరోసారి అజయ్ తన అద్భుతమైన నటన కనపరిచాడు. కొద్దీ రోజుల క్రితం రిలీజ్ అయినా టీజర్ కూడా ప్రేక్షుకులను ఆకట్టుకుంది.