అడివి శేష్ ప్రధాన పాత్రలో శశికిరణ్ తిక్కా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మేజర్. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథగా తెరకెక్కిన ఈ సినిమా జూన్ 3 న రిలీజ్ అయ్యేయి భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా రికార్డు కలెక్షన్లు రాబడుతోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమాను నిర్మించాడు. ఇక ఇప్పటికే ఈ సినిమా చూసిన అభిమానులతో పాటు ప్రముఖులు కూడా కంటతడి పెట్టిన విషయం విదితమే. తాజాగా ఆ లిస్ట్ లో చేరింది సీనియర్ బ్యూటీ సదా. ఇటీవలే ‘మేజర్’ సినిమా చూసిన ఆమె కన్నీటి పర్యంతమయ్యింది.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఉగ్రదాడి జరిగిన సమయంలో తాను ముంబైలోనే వున్నానని. ఇప్పడు సినిమా చూస్తుంటే ఆ రోజులు గుర్తొచ్చాయని చెప్పుకొచ్చింది. కొన్ని సన్నివేశాలు రోమాంచితంగా వున్నాయని. శశికిరణ్ సినిమాని తీసిన తీరు, అడివి శేష్ పాత్రలో ఒదిగిపోయిన విధానం అద్భుతం అని ప్రశంసలు కురిపించింది. ఆ సమయంలో ఉన్నట్లే తనకు అనిపించిందని, ఆ దాడులను మరోసారి కళ్లారా చూసినట్లు ఉందని చెప్పుకొచ్చింది. ప్రతి ఒక్కరు ఈ సినిమాను తప్పక చూడమని కోరింది. ఇక ప్రస్తుతం సదా యూట్యూబ్ తో పాటు పలు టీవీ షోల్లో తన ఇష్టాఇష్టాలు అభిప్రాయాలని అభిమానులతో పంచుకుంటూ వస్తోంది.