NTR-NEEL : జూనియర్ ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న డ్రాగన్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం స్పీడ్ గా జరుపుకుంటోంది. అయితే ఇందులో ఎవరు హీరోయిన్ అనే ప్రశ్న అందరిలోనూ ఉంది. ఈ మధ్య ఓ పేరు బాగా వినిపిస్తోంది. కానీ ఆమెనే తీసుకుంటున్నారా లేదా అనేది ఒక సస్పెన్స్. దానికి నిర్మాత క్లారిటీ ఇచ్చేశాడు. ప్రస్తుతం తమిళ హీరో శివకార్తికేయన్ హీరోగా రుక్మిణి వసంత్ హీరోయిన్ గా వస్తున్న మూవీ మదరాసి. సెప్టెంబర్ 5న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఈవెంట్ ను తాజాగా హైదరాబాద్ లో నిర్వహించారు. ఇందులో ప్రొడ్యూసర్ ఎన్వీ ప్రసాద్ మాట్లాడుతూ రుక్మిణి వసంత్ హీరోయిన్ అంటే ఆమె గురించి తాను ఎంక్వయిరీ చేసినట్టు తెలిపాడు. ఆమె గురించి తనకు షాకింగ్ విషయాలు తెలిశాయన్నాడు.
Read Also : Bhojpuri Actor : మహిళా అభిమాని బాడీపై స్టార్ నటుడి చెత్త కామెంట్లు..
రుక్మిణి వసంత్ ఇప్పుడు మామూలు హీరోయిన్ కాదు. ఆమె చేతిలో వరుసగా పెద్ద సినిమాలే ఉన్నాయి. కాంతార-2 సినిమాలో ఆమెనే హీరోయిన్ గా తీసుకున్నారు. ఆ తర్వాత టాక్సిక్ లో కనిపించబోతోంది. అలాగే ఎన్టీఆర్ సినిమాలోన ఆమెనే హీరోయిన్ గా చేస్తోంది. ఈ మూవీ తర్వాత ఫుల్ బిజీగా గడపబోతోంది అంటూ తెలిపాడు. దీన్ని బట్టి ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ సినిమాలో కచ్చితంగా రుక్మిణి వసంత్ ను ఫిక్స్ చేశారని తేలిపోయింది. ఆమె పేరు చాలా కాలంగా వినిపిస్తోంది. కానీ మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించలేదు. ఇప్పుడు నిర్మాత స్వయంగా చెప్పడంతో అసలు విషయం బయటకు వచ్చేసింది. దీనిపై త్వరలోనే అఫీషియల్ ప్రకటన కూడా రాబోతోందంట. రుక్మిణి వసంత్ ప్రస్తుతం సౌత్ లో పెద్ద సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటుంది. ఆమె ఎన్టీఆర్ సరసన సూపర్ గా సెట్ అవుతుందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Read Also : Nara Rohith : శిరీషతో పెళ్లి ఎప్పుడో చెప్పేసిన నారా రోహిత్