RT 78 : జెట్ స్పీడ్‌లో రవితేజ.. వివేక్ ఆత్రేయతో ‘తులాభారం’ స్టార్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ అభిమానులకు గుడ్ న్యూస్. ఇరుముడి ఘనవిజయంతో మాస్ మహారాజా రవితేజ మాంచి జోరుమీదున్నాడు. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా జెట్ స్పీడ్ లో మరో సినిమాను సెట్స్ మీదకు తీసుకువెళ్లాడు రవితేజ. కెరీర్లో 78వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్నాడు. విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకులను మెప్పించే వివేక్ ఆత్రేయ, రవితేజతో చేయబోయే ఈ సినిమా నేడు పూజ కార్యక్రమాలతో ప్రారంభమైంది.
ఈ చిత్రంలో రవితేజ సరసన ప్రియాంక మోహన్ మరియు అనశ్వరా రాజన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. టాలీవుడ్ సీనియర్ నటుడు జె.డి. చక్రవర్తి విలన్ పాత్రలో కనిపిస్తుండగా డైరెక్టర్ కమ్ నటుడు తరుణ్ భాస్కర్ కీలక పాత్రలో మెరవనున్నాడు. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. సినిమా టైటిల్ మరియు పూర్తి వివరాలను మేకర్స్ త్వరలోనే వెల్లడించనున్నారు. బ్రిడ్జ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమా రవితేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ సినిమా అవుతుందని మేకర్స్ ధీమాగా ఉన్నారు. రవితేజ మరియు జేడీ చక్రవర్తిల మధ్య వచ్చే ముఖాముఖి సన్నివేశాలు థియేటర్లలో నెవర్ బిఫోర్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తాయని భావిస్తున్నారు. క్రైమ్ కామెడీ నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమాకు ‘తులాభారం’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు మేకర్స్.
Also Read
తాజావార్తలు
-
CM Chandrababu: ‘స్వయం ఏపీ’ బ్రాండ్.. 10 లక్షల మంది మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం!
-
Rashmika : 400 కుటుంబాలను దత్తత తీసుకున్న రష్మిక
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
Aadarsha Kutumbam : ఆదర్శ కుటుంబం జాడేది?
-
Sai Durgha Tej: పవన్ కల్యాణ్‌తో మూవీ ఎప్పుడు?.. తప్పు మాదే అంటూ సాయి ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!