Vishwambhara : మెగాస్టార్ చిరంజీవి హీరోగా బింబిసార డైరెక్టర్ వశిష్ట తెరకెక్కిస్తున్న మూవీ విశ్వంభర. స్పీడ్ గా షూటింగ్ జరుపుకుంటోంది ఈ మూవీ. సోషియో ఫాంటసీగా వస్తున్న ఈ సినిమాపై తరచూ ఏదో ఒక అప్డేట్ వస్తోంది. ఈ మూవీలో భారీగా వీఎఫ్ ఎక్స్ వాడుతున్నట్టు తెలుస్తోంది. కేవలం వీఎఫ్ ఎక్స్ కోసమే రూ.75 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు సమాచారం. హాలీవుడ్ సినిమాలకు పనిచేసిన ప్రముఖ వీఎఫ్ ఎక్స్ కంపెనీతో ఒప్పందం కూడా జరిగిపోయిందంట. ఈ వార్త టాలీవుడ్ ను ఊపేస్తోంది. కేవలం వీఎఫ్ ఎక్స్ కే ఇంత భారీగా ఖర్చు చేస్తున్నారు అంటే.. సినిమాలో సిజీలు ఏ స్థాయిలో ఉంటాయో అంటూ కామెంట్లు చేస్తున్నారు ప్రేక్షకులు.
Read Also : Pavani Reddy : రెండో పెళ్లి చేసుకున్న నటి పావనిరెడ్డి
అసలే ఈ మూవీ సోషియో ఫాంటసీగా వస్తోంది. ఈ లెక్కన మూవీలో భారీగానే వీఎఫ్ ఎక్స్ ఖర్చు చేస్తారు. కానీ ఈ స్థాయిలో అంటే.. మూవీని రియాల్టీ కంటే వీఎఫ్ ఎక్స్ మీదనే ఎక్కువగా ఆధారపడినట్టు తెలుస్తోంది. ఇప్పటికే షూటింగ్ దాదాపు చివరకు వచ్చేసింది. జులై నెలలో దీన్ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉన్నా.. వీఎఫ్ ఎక్స్ పనుల కారణంగానే ఆలస్యం అయింది. రీసెంట్ గానే రామ రామ అనే పాటను కూడా రిలీజ్ చేసింది మూవీ టీమ్. త్వరలో మూవీ నుంచి వరుస అప్డేట్లు వస్తాయనే టాక్ వినిపిస్తోంది.