దర్శక దిగ్గజం రాజమౌళి ఆయన టీంతో కలిసి ఇప్పటికే ‘ఆర్ఆర్ఆర్’కు సంబంధించిన ప్రమోషన్స్ లో దూకుడు పెంచారన్న విషయం తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించిన ఈ మాగ్నమ్ ఓపస్ మూవీ ప్రమోషన్ కోసం దర్శకుడు విభిన్నమైన ప్రచార వ్యూహాన్ని ప్లాన్ చేసినట్లు కనిపిస్తోంది. ఇప్పుడు తాజా అప్‌డేట్ ప్రకారం ‘ఆర్ఆర్ఆర్’ స్టార్స్ తారక్, చరణ్ నిన్న సాయంత్రం వరకు ప్రో కబడ్డీ ప్రారంభ వేడుకలో జాతీయ, ప్రాంతీయ స్టార్ స్పోర్ట్స్ ఛానెల్‌లలో సినిమాను ప్రమోట్ చేశారు. ‘ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్)’ వేదికగా ఈ పాన్ ఇండియా చిత్రాన్ని ప్రచారం చేయడం అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఐపీఎల్ తర్వాత భారీ ఆదరణతో దూసుకెళ్తున్న పీకేఎల్ ఎనిమిదో సీజన్‌ను బుధవారం ‘ఆర్‌ఆర్‌ఆర్’ హీరోలు, దర్శకుడు స్టార్ట్ చేశారు.
పవర్‌ఫుల్ గేమ్‌కు ఇంతకంటే పదునైన ప్రారంభం ఏముంటుంది 🤩
— StarSportsTelugu (@StarSportsTel) December 22, 2021
𝐘𝐨𝐮𝐧𝐠𝐓𝐢𝐠𝐞𝐫 @tarak9999 🔥
𝐌𝐞𝐠𝐚𝐏𝐨𝐰𝐞𝐫𝐒𝐭𝐚𝐫 @AlwaysRamCharan 😍
𝐉𝐚𝐤𝐤𝐚𝐧𝐧𝐚 @ssrajamouli 🥳
చూడండి#vivoProKabaddi#LePanga
మీ #StarSportsTelugu / StarMaaGold / Disney + Hotstar లో pic.twitter.com/uMxEeLbZvd
“పవర్‌ఫుల్ గేమ్‌కు ఇంతకంటే పదునైన ప్రారంభం ఏముంటుంది?” అంటూ దీనికి సంబంధించిన వీడియోలను స్టార్ స్పోర్ట్స్ సోషల్ మీడియాలో షేర్ చేయగా, అవి వైరల్ అవుతున్నాయి. పీకేఎల్ లోనూ సందడి చేసి ‘ఆర్ఆర్ఆర్’ హీరోలు మరోసారి దేశవ్యాప్తంగా ఉన్న హీరోల దృష్టిని తమవైపుకు తిప్పుకున్నారు. కాగా రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ ఇద్దరు నిజమైన స్వాతంత్ర్య సమరయోధులు భీమ్, అల్లూరి సీతారామ రాజుల మధ్య కల్పిత స్నేహం చుట్టూ తిరిగే పీరియాడికల్ డ్రామా. ఇందులో అజయ్ దేవగన్, శ్రియా శరణ్, ఒలివియా మోరిస్, అలిసన్ డూడీ, రే స్టీవెన్‌సన్ కూడా కీలక పాత్రల్లో నటించారు. డీవీవీ దానయ్య నిర్మించిన ‘ఆర్ఆర్ఆర్’ 2022 జనవరి 7న థియేటర్లలోకి రానుంది.
Read Also :