RRR బ్లాక్ బస్టర్ హిట్ తో చిత్రబృందం ఫుల్ ఖుషీగా ఉంది. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియా భట్, అజయ్ దేవగన్ కీలక పాత్రల్లో పోషించగా, దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించారు. ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్స్ తో బాక్సాఫీస్ వద్ద ‘ఆర్ఆర్ఆర్’ మూవీ చరిత్ర సృష్టించింది. ఇక ఇప్పటికే ‘ఆర్ఆర్ఆర్’ టీం సినిమా విజయాన్ని పురస్కరించుకుని సంబరాల్లో మునిగి తేలుతున్న విషయం తెలిసిందే. తాజాగా ముంబైలో RRR Success Celebrations నిర్వహించారు. ఈ వేడుకకు బాలీవుడ్ ప్రముఖులు చాలామంది హాజరు కావడం గమనార్హం.
Read Also : Maa Ishtam : ప్రమోషన్స్ కోసం ‘ఆర్ఆర్ఆర్’ని వాడేస్తున్న ఆర్జీవీ
ఈ వేడుకలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లు అదరగొట్టారు. బ్లూ డెనిమ్‌తో బ్లాక్ టీషర్ట్‌లో, క్యాజువల్ కోట్‌తో జూనియర్ ఎన్టీఆర్, మరోవైపు రామ్ చరణ్ పూర్తిగా నలుపు రంగు దుస్తులలో ఈవెంట్‌లో హ్యాండ్సమ్ గా కన్పించారు. రామ్ చరణ్ అయ్యప్ప దీక్ష కారణంగా రెడ్ కార్పెట్‌పై కూడా చెప్పులు లేకుండా నడిచారు. ఎస్ఎస్ రాజమౌళి తన డిజైనర్ దుస్తుల్లో సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. వీరితో పాటు ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్, అమీర్ ఖాన్, హుమా ఖురేషి, గీత రచయిత జావేద్ అక్తర్, ప్రముఖ నటుడు జీతేంద్ర, సతీష్ కౌశిక్, అశుతోష్ గోవారికర్ తో పాటు తదితరులు పార్టీలో పాల్గొన్నారు. ఇక ‘ఆర్ఆర్ఆర్’ త్రయం కేక్ కోసి మూవీ సక్సెస్ ను గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకున్నారు. ఈ ఈవెంట్ లో పెన్ స్టూడియోస్ జయంతి లాల్… రాజమౌళితో పాటుగా చరణ్ మరియు తారక్ లను ఘనంగా సత్కరించారు. రామ్ చరణ్ #RC15 షూటింగ్ కోసం అమృత్ సర్ వెళ్లగా, అటు నుంచి నేరుగా ముంబైకి వచ్చి పార్టీకి హాజరయ్యారు. ప్రస్తుతం పార్టీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Ace Director @ssrajamouli, Mega Power Star @AlwaysRamCharan & Young Tiger @tarak9999 attended the Blockbuster #RRR success party in #Mumbai.@PenMovies @jayantilalgada pic.twitter.com/spgQ8grU9X
— VamsiShekar ON DUTY (@UrsVamsiShekar) April 6, 2022