మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా నటించిన రౌద్రం రణం రుధిరం (ఆర్.ఆర్.ఆర్) మూవీ ఇంకో వారం రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మితమైన ఆర్.ఆర్.ఆర్ మూవీ ఐదు భాషల్లో విడుదల కానుంది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడం, మలయాళం భాషల్లో ఈ సినిమా మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానుంది.
లేటెస్ట్‌గా ఈ మూవీ సెన్సార్ రిపోర్ట్ బయటకు వచ్చింది. ఈ సినిమాకు సెన్సార్ సభ్యులు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. అంతేకాకుండా ఈ మూవీ రన్‌టైమ్ కూడా తెలిసిపోయింది. ఆర్.ఆర్.ఆర్ సినిమా రన్‌టైమ్ 3 గంటల 6 నిమిషాల 54 సెకన్‌లు. అంటే మధ్యలో ఇంటర్వెల్‌తో కలుపుకుని మూడున్నర గంటలు ఈ సినిమా థియేటర్లలో ప్రదర్శితం కానుంది. దీంతో సింగిల్ థియేటర్లలో షో టైమింగ్స్ మారిపోయే అవకాశం ఉంది. రాజమౌళి గత చిత్రం బాహుబలి ది కంక్లూజన్ రన్‌టైమ్ 2 గంటల 47 నిమిషాలు. ఇప్పుడు బాహుబలి-2 సినిమా కంటే ఆర్.ఆర్.ఆర్ రన్‌టైమ్ ఎక్కువగా ఉండటం గమనార్హం.