రౌడీ హీరో విజయ్ దేవరకొండని యూత్ కి, ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గర చేసిన సినిమా గీత గోవిందం. ఈ మూవీతో డైరెక్టర్ పరశురామ్-విజయ్ దేవరకొండ కాంబినేషన్ కి మంచి పేరొచ్చింది. గీత గోవిందం కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ దాదాపు అయిదేళ్ల తర్వాత కలిసి సినిమా చేస్తున్నారు. VD 13 అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లిన ఈ మూవీని దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తుండగా మృణాల్ హీరోయిన్ గా నటిస్తోంది. సంక్రాంతి సీజన్ ని టార్గెట్ చేస్తూ జెట్ స్పీడ్ లో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా 2024 మిడ్ కి వాయిదా పడింది. ‘ఫ్యామిలీ స్టార్’ అనే టైటిల్ ని ఫిక్స్ చేసి… గ్లిమ్ప్స్ ని కూడా రిలీజ్ చేసిన మేకర్స్ విజయ్ ఫ్యాన్స్ ని మెప్పించారు. వారం పది రోజుల పాటు సోషల్ మీడియాలో ‘ఐరనే వంచాలా ఏంటి?” డైలాగ్ ట్రెండ్ అయ్యింది.
బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ లో షూటింగ్ జరుపుకుంటున్న ది ఫ్యామిలీ స్టార్ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో స్టార్ట్ అయ్యింది. విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్, ఇతర మెయిన్ కాస్ట్ పాల్గొననున్న ఈ షెడ్యూల్ అయిదు రోజుల పాటు జరగనుందని సమాచారం. విజయ్-మృణాల్ పెయిర్ ఎలా ఉంటుంది అనే క్యూరియాసిటీ సినీ అభిమానుల్లో ఉంది. ఈ ప్రశ్నకి సమాధానం తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. ది ఫ్యామిలీ స్టార్ సినిమాని సంక్రాంతి నుంచి తప్పించిన మేకర్స్… ఇప్పుడు ఏప్రిల్ 5న దేవర రిలీజ్ కాకుంటే ఆ డేట్ పై ఖర్చీఫ్ వేయడానికి రెడీ అవుతున్నారు. ఏప్రిల్ 5న దేవర రాకుండా దేవరకొండ థియేటర్స్ లోకి వచ్చే అవకాశం ఉంది. మరి ఫైనల్ రిలీజ్ డేట్ తెలియాలి అంటే దేవర విషయంలో ఒక క్లారిటీ రావాల్సి ఉంది.