అల్లు అర్జున్ పుట్టిన రోజంటే అభిమానులకు పండగ రోజు కింద లెక్క. తమ హీరోల పుట్టిన రోజున చాలా మంది తమ ఊళ్ళలో సేవాకార్యక్రమాలు చేస్తుంచారు. చిరంజీవి అభిమానులైతే రక్తదాన శిబిరాలు నిర్వహిస్తుంటారు. అయితే చిత్రసీమలోనూ హీరోలకు ఫ్యాన్స్ ఉంటే వాళ్ళు తమదైన స్టైల్ లో బర్త్ డే ను సెలబ్రేట్ చేస్తారు. బిగ్ బాస్ ఫేమ్ తెలుగు ర్యాప్ సింగర్ రోల్ రైడా అదే చేశాడు. శుక్రవారం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా తన అభిమాన హీరో కోసం ఓ పాట రాసి, పాడి, దానిని వీడియోగా చిత్రీకరించి డెడికేట్ చేశాడు.
Read Also : Allu Arjun Birthday Celebrations : సెర్బియాలో గ్రాండ్ పార్టీ… పిక్స్ వైరల్
‘ఇది సర్ నా బ్రాండ్’ అంటూ అల్లు అర్జున్ మీద తనకున్న అభిమానాన్ని పాట రూపంలో చాటాడు. అల్లు అర్జున్ తెర మీద కనిపిస్తే ఎంత పొంగిపోతారో, ఫస్ట్ లుక్ వస్తే ఎంత హ్యాపీ ఫీలవుతారో, ఆయన సినిమా విడుదలైతే ఎలాంటి జాతర చేస్తారో విడమర్చి తన బృందంతో కలిసి ఈ పాట రూపంలో చెప్పే ప్రయత్నం చేశాడు రోల్ రైడా. ‘ఆర్య’ నుండి అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉన్న తాము తుది శ్వాస విడిచే వరకూ అలానే ఉంటామని తెలిపాడు రోల్ రైడా. ఈ పాటను ఆర్. ఆర్. ధృవన్ స్వరపరిచిన ఈ పాటకు ఢీ శివ మాస్టర్ కొరియోగ్రఫీ చేయగా, రాకేశ్ పెండ్యాల సినిమాటోగ్రఫీ అందించారు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ బన్నీ ఫ్యాన్స్ ను విశేషంగా ఆకట్టుకుంటోంది.