కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ… మూడు నాలుగేళ్ల కిత్రం వరకూ సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. మూవీ మేకింగ్ బడ్జెట్స్, హీరోల మార్కెట్స్ తక్కువ, కలెక్షన్స్ తక్కువ అందుకే ఎక్కువగా రీమేక్ సినిమాలు చేసుకుంటూ ఇండస్ట్రీ రన్ చేస్తూ ఉంటారు. ఈ పరిస్థితిని పూర్తిగా చెరిపేసాడు కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన మొదటి పాన్ ఇండియా హీరో రాకింగ్ స్టార్ యష్. ప్రశాంత్ నీల్ తో కలిసి KGF 1 అండ్ 2 సినిమాలు చేసిన యష్… రెండు సినిమాలతో కలిపి 1500 కోట్లు రాబట్టాడు. ఒక కన్నడ సినిమా ఈ రేంజ్ కలెక్షన్స్ ని రాబడుతుందని ఎవరు కలలో కూడా ఊహించి ఉండరు. రాఖీ భాయ్ గా యష్ కొత్త పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. KGF 2 సినిమా 2022లో రిలీజ్ అయ్యింది. ఆల్మోస్ట్ రెండేళ్ల క్రితం KGF 2 సినిమాతో హిట్ కొట్టిన యష్ నుంచి నెక్స్ట్ సినిమా ఎప్పుడు వస్తుంది అనేది బేతాళ ప్రశ్నగా మారింది. యష్ నెక్స్ట్ సినిమా కోసం పాన్ ఇండియా ఆడియన్స్ అంతా ఈగర్ గా వెయిట్ చేస్తూనే ఉన్నారు. రోజులు గడుస్తున్నాయి కానీ అనౌన్స్మెంట్ మాత్రం రాలేదు.
ఎట్టకేలకు అభిమానుల వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ వేసి యష్ తన 19వ సినిమా అనౌన్స్మెంట్ ఇచ్చేసాడు. ముందు నుంచి వినిపిస్తున్నట్లుగానే యష్, గీతూ మోహన్ దాస్ డైరెక్షన్ లోనే సినిమాని అనౌన్స్ చేసాడు. “టాక్సిక్” అనే టైటిల్ తో ఈ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేసిన యష్… టైటిల్ రివీల్ మోషన్ పోస్టర్ లో కూడా గన్ పట్టుకోని బియర్డ్ లుక్ లో రాఖీ భాయ్ లా కనిపించాడు. ఇతర కాస్ట్ అండ్ క్రూ డీటెయిల్స్ ని రివీల్ చెయ్యలేదు కానీ 2025 ఏప్రిల్ 10న సినిమాని విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేసారు అంటే మరో ఏడాదిన్నర పాటు యష్ నుంచి సినిమా వచ్చే అవకాశమే లేదు. ఓవరాల్ గా చూసుకుంటే 2022 ఏప్రిల్ 14న KGF 2 రిలీజ్ అయ్యింది, 2025 ఏప్రిల్ 10న యష్ 19 రిలీజ్ కానుంది. మరి అన్ని రోజులు వెయిట్ చేయించి యష్ ఎలాంటి సినిమాతో ఆడియన్స్ ముందుకి వస్తాడో చూడాలి.
'What you seek is seeking you' – Rumi
A Fairy Tale for Grown-ups
#TOXIChttps://t.co/0G03Qjb3zc@KvnProductions #GeetuMohandas— Yash (@TheNameIsYash) December 8, 2023