వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసర లేదు. తనకు ఏది తప్పనిపిస్తే దాని నిర్మొహమాటంగా చెప్పేస్తాడు. ఎదుటివారు ఎంతటి వాడైనా సరే అస్సలు భయపడడు. సినిమాలు, రాజకీయ పార్టీలు ఈ ఒక్కతిని వదలకుండా ఏకిపారేసిన వర్మ ఎప్పుడు సీఎం జగన్ ని తప్పు పట్టింది లేదు. ఎందుకంట ఆయన ఎంతో కష్టంతో పైకి వచ్చిన వ్యక్తి అని, ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా నిలబడి విజయాన్ని అందుకున్న మనిషి అని , అందుకే జగన్ తనకు నచ్చుతాడు అంటూ చెప్పుకొచ్చిన వర్మ తాజాగా జగన్ ప్రభుత్వం చేసింది తప్పు అని చెప్పడం ప్రస్తుతం సంచలనం సృష్టిస్తోంది. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ల ధరల్ని తగ్గించటంపై చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలువురు హీరోలు ఈ విషయమై తమ స్పందన తెలియజేశారు. ఇక తాజాగా ఈ ఇష్యూపై వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇటీవల ఒక ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వర్మ మాట్లాడుతూ “ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ ధరను తగ్గించడం నా దృష్టిలో పూర్తిగా తప్పు.. అది నిర్మాతలకు కష్టం తెస్తోంది. టికెట్ ధరను నిర్ణయించే హక్కు ఉత్పత్తి దారులకు ఉంటుంది. అయితే దాన్ని కొనాలా..? వద్దా..? అనేది వినియోగదారుడి ఇష్టం. సినిమాని చూడాలనుకొనేవారు టికెట్ ఎంత ఉన్నా కొని చూస్తారు.. నచ్చనివారు మానేస్తారు. అది వారి ఇష్టం. సాధారణ కారు ధరకు బెంజ్ కారు ఇవ్వాలంటే ఎలా? టికెట్ ధరలు తగ్గించటం ద్వారా ప్రభుత్వం కావాలనే సినిమా ఇండస్ట్రీ మీద కక్ష పూరితంగా వ్యవహరిస్తుందా? లేదా? అనేది నాకు తెలియదు. ఇక హీరోల రెమ్యూనిరేషన్ తగ్గించుకోమనడం.. సాధ్యం కానీ పని. టికెట్ రేట్లు తగ్గడం వలన నష్టపోయిది హీరో కాదు నిర్మాత మాత్రమే. ఏదిఏమైనా ముమ్మాటికి ఏపీ ప్రభుత్వం చేస్తుంది తప్పే” అని తేల్చి చెప్పారు. ప్రస్తుతం వర్మ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఎప్పుడు లేనిది జగన్ ప్రభుత్వాన్నే వర్మ వేలెత్తి చూపించడం ఏంటి అని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. మరి వర్మ వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వం ఎలాంటి రియాక్షన్ ఇస్తుందో చూడాలి.