RGV Meets AP DGP: సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ వ్యూహం రిలీజ్ కు రెడీ అవుతోంది. గత నెల నవంబర్ 10న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమాకి సెన్సార్ కాకపోవడంతో వాయిదా పడింది. ఇక ఎట్టకేలకు ఆ సెన్సార్ పూర్తి చేసుకుని డిసెంబర్ 29 రిలీజ్ చేయబోతున్నారు. అయితే తాజాగా ఈ సినిమా రిలీజ్ గురించి అమరావతి ఉద్యమ నేత కొలికపూడి శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. శ్రీనివాసరావు ఓ న్యూస్ ఛానల్ లైవ్ లో మాట్లాడుతూ సమాజానికి తన సినిమాలతో కంటకంగా మారిన డైరెక్టర్ ఆర్జీవీ తల నరికి వస్తే కోటి రూపాయలు బహుమతి ఇస్తానని కొలికపూడి శ్రీనివాసరావు ప్రకటించారు.
Saripodhaa Sanivaaram: గ్యాప్ ఇచ్చి పనిలో పడిన నాని!
ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోండగా కొలికపూడి శ్రీనివాసరావు చేసిన బహిరంగ వ్యాఖ్యలపై..రామ్ గోపాల్ వర్మ మంగళవారం ఆంధ్రప్రదేశ్ పోలీసులకు ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేశారు. అలాగే ఇక ఈ విషయం పై ఆర్జీవీ నేరుగా నేడు ఏపీ డీజీపీ కార్యాలయానికి చేరుకున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కొలికపూడి శ్రీనివాసరావు పై డిజిపికి ఆయన ఫిర్యాదు చేశారు. . వ్యూహం సినిమాలో వైఎస్ జగన్‍మోహన్ రెడ్డి పాత్రలో రంగం ఫేమ్ అజ్మల్ నటించాడు. 2009లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి (వైఎస్ఆర్) మరణం నుంచి 2019లో వైఎస్ జగన్‍మోహన్ రెడ్డి సీఎం అయ్యే వరకు జరిగిన చాలా విషయాలను ఈ సినిమాలో ఆర్జీవీ చూపించాడు. 2009 సెప్టెంబర్ 2వ తేదీన అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌కు ప్రమాదం జరిగిన సీన్ మొదలు 2019 ఎన్నికల్లో విజయం సాధించే వరకు ఉంది.
— Ram Gopal Varma (@RGVzoomin) December 27, 2023