సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ లేటెస్ట్ మూవీ ‘వ్యూహం’. నవంబర్ 10న రిలీజ్ కానున్న ఈ మూవీ ట్రైలర్ బయటకి వచ్చి సోషల్ మీడియాలో హాట్ డిస్కషన్స్ ని తెరలేపింది. వర్మ… పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసాడు, చంద్రబాబు నాయుడుని టార్గెట్ చేసాడు, జగన్ కి మాత్రమే సపోర్ట్ చేసాడు, వ్యూహం ప్యాకేజ్ సినిమా అనే కామెంట్స్ సోషల్ మీడియాలో స్టార్ట్ అయ్యాయి. ఇవేమి పట్టించుకునే అలవాటు లేని వర్మ… ఎప్పటిలాగే వ్యూహం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో స్పీచ్ ఇచ్చాడు. దస్పల్లా హోటల్ లో వ్యూహం ట్రైలర్ రిలీజ్ ప్రెస్ మీట్ జరిగింది.
ఈ ఈవెంట్ లో వర్మ మాట్లాడుతూ… “‘వ్యూహం’ ట్రైలర్ రిలీజ్ చేసిన రామ్ గోపాల్ వర్మ.. ఈ సినిమా వెనుక ఎలాంటి వ్యూహం ఏమి లేదు నిజం మాత్రమే ఉంది.. వ్యూహం రెండు భాగాలుగా వస్తుంది.. వైఎస్ మరణం తర్వాత నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలతో ఈ రెండు సినిమాలు ఉంటాయి.. నేను చాలా సౌమ్యుడుని.. ఎప్పుడు చంద్రబాబుని కలవలేదు.. నాకు వైఎస్ జగన్ అంటే ఒక అభిప్రాయం ఉంది.. చంద్రబాబు అంటే ఒక అభిప్రాయం ఉంది.. నిజమనేది ఈ సినిమాలో చూస్తారు. పబ్లిక్ డొమైన్ లో ఉన్న జీవితాలను సినిమా తీయడానికి ఎవరి పర్మిషన్ అవసరం లేదు.. నేను లక్ష్మిస్ ఎన్టీఆర్, సర్కార్ సినిమాలు అలా తీసినవే.. నేను వైఎస్ జగన్ మీద ఉన్న అభిమానంతో సినిమా తీశాను.. కానీ, ఇక్కడ ప్యాకేజ్ అనేదానికి ఆస్కారం లేదు.. నాకు టీడీపీ గురించి కానీ.. వైసీపీ గురించి కానీ.. వేరే పార్టీ గురించి కానీ తెలీదు.. నేను నమ్మిన నిజం చెపుతున్నాను.. ఈ సినిమాలో చిరంజీవి పాత్ర ఉంది” అని చెప్పాడు. ఇదే తన లాస్ట్ పొలిటిల్ సినిమా అని వర్మ షాక్ ఇచ్చాడు.
వ్యూహం సినిమా ప్రొడ్యూసర్ దాసరి కిరణ్ కుమార్ మాట్లాడుతూ… “ఏ ముఖ్యమంత్రి కొడుకు కూడా పడని కష్టాలు జగన్ పడ్డారు అందుకే ఈ సినిమా తీస్తున్నాము. కూడు గుడ్డ లేని వారికి పేద ప్రజల సంక్షేమానికి జగన్ గారి ప్రభుత్వం ఎంతో చేస్తుంది. ప్రజలు మళ్ళీ జగన్ గారికి పట్టం కడతారు” అని చెప్పాడు.