నటుడు దర్శన్‌కు మంజూరైన మధ్యంతర బెయిల్‌కు హైకోర్టు పలు షరతులు విధించింది. ఇది 6 వారాల మధ్యంతర బెయిల్ కాగా చికిత్స కోసం బెయిల్ మంజూరు చేశారు.. దీనిపై స్పందించిన రేణుకాస్వామి తండ్రి.. ఏం అన్నారు అనే వివరాల్లోకి వెళదాం పదండి. తన అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో నటుడు దర్శన్ అరెస్టయ్యాడు.. ఈ కేసులో చాలా కాలం తర్వాత దర్శన్‌కి మధ్యంతర బెయిల్ వచ్చింది.. ఈ వార్త ఆయన కుటుంబ సభ్యులను మరియు అభిమానులను ఆనందపరిచింది. ఇప్పుడు దీనిపై మృతుడు రేణుకాస్వామి తండ్రి మాట్లాడారు. న్యాయవ్యవస్థపై, చట్టంపై అలాగే పోలీసులపై మాకు నమ్మకం ఉంది. దర్శన్ ఆరోగ్య సమస్యల వలన బెయిల్ వచ్చింది.
Darshan: పండుగ పూట దర్శన్ కి గుడ్ న్యూస్
కానీ దోషులకు శిక్ష పడుతుందన్న నమ్మకం ఉంది అని అన్నారు. ఇలాంటి కేసుల్లో నిందితుడిగా భావిస్తున్న వ్యక్తికి బెయిల్ రాగానే తమకు అన్యాయం జరిగిపోతోంది అంటూ మాట్లాడే బాధితులే ఎక్కువ ఉంటారు. కానీ ఈ విషయంలో రేణుకాస్వామి తండ్రి ఇలా మాట్లాడడం కాస్త ఆసక్తి రేపే అంశమే. నటుడు దర్శన్‌కు 6 వారాల మధ్యంతర బెయిల్ మంజూరైంది. అయితే కోర్టు ఉత్తర్వులు బళ్లారి జైలుకు చేరుకుని సాయంత్రం 5 గంటల లోపు న్యాయ ప్రక్రియ పూర్తయితేనే ఈరోజు దర్శన్ జైలు నుంచి విడుదలవుతారు.. మరి ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.. నటుడు దర్శన్‌కు మంజూరైన మధ్యంతర బెయిల్‌పై హైకోర్టు పలు షరతులు విధించింది. ఇది 6 వారాల మధ్యంతర బెయిల్, చికిత్స కోసం మంజూరు చేయబడింది. దర్శన్ పాస్‌పోర్టును సరెండర్ చేయాలని, షూటింగ్‌లో పాల్గొనకూడదని కూడా కోర్టు తెలిపింది.