Renu Desai Clarity in Akira Nandan Acting Debut: మెగా ఫాన్స్ అందరూ అత్యంత ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న అంశం ఏదైనా ఉందా అంటే అది పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా నందన్ సినీ రంగ ప్రవేశమే. నిజానికి పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా ఇప్పుడే ఆరడుగుల ఎత్తుతో అందరినీ ఆకర్షించే అందంతో ఉండడంతో సహజంగానే ఆయన ఎప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తాడు అని అందరిలోనూ ఆసక్తి ఉంది. అయితే ఆ విషయంలో మెగా ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్ చెప్పారు రేణు దేశాయ్. టైగర్ నాగేశ్వరరావు సినిమాలో హేమలత లవణం అనే పాత్రలో నటించిన ఆమె సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో ముచ్చటించారు. ఈ క్రమంలో అకిరా గురించి ఎదురైన ప్రశ్నలకు ఆమె షాకింగ్ ఆన్సర్ ఇచ్చారు. అకీరా హీరోగా ఎప్పుడు లాంచ్ అవుతున్నాడు అని అడిగితే ముందు ఆయననే అడగాలని చెప్పిన రేణు దేశాయ్ ఆ తర్వాత తాను ఇందాకే అకిరాతో మాట్లాడాను అని ఆయనకు ఈరోజు వరకు అయితే హీరో అవ్వాలనే ఉద్దేశమే లేదని తేల్చి చెప్పారు. ఒక వేళ ఆయనకు కనుక నటించాలి అని ఉంటే తానూ ప్రోత్సహిస్తానని అన్నారు.
Chiranjeevi: రజనీ ‘జైలర్’ కామెంట్స్.. చిరంజీవి చురకలు?
ఇక తనకు అకీరా విషయంలో రెండు కోరికలు ఉన్నాయని అవేమంటే ఆయన పియానో ప్లే చేస్తుంటే ఆ స్టేడియంలో అతిరథ మహారథులు ఉండాలని అలాగే రెండవది ఆయనని తెర మీద చూడాలని కోరుకుంటున్నానని ఆమె చెప్పుకొచ్చారు. నేను ఒక నటి, నా కుమారుడి తండ్రి ఒక నటుడు, వారి కుటుంబం అంతా నటులే అలాంటప్పుడు అతను కూడా వెండితెర మీద వెలిగిపోవాలని నాకు కూడా ఉంటుంది. కానీ ఏమి చేయాలి అనేది నా కుమారుడి ఇష్టం. ఒకవేళ రేపు నేను హీరో అవ్వాలి అనుకుంటున్నాను అంటే నేను చేయగలిగింది నేను చేస్తానని రేణు చెప్పుకొచ్చారు. అంతేకాదు ప్రస్తుతం అకిరా ఫిలిమ్ స్కూల్ లో మ్యూజిక్ నేర్చుకుంటూ ఫిలిం మేకింగ్ మీద కోర్సు తీసుకుంటుంన్నాడని చెప్పుకొచ్చారు. అకీరాది చాలా భిన్నమైన వ్యక్తిత్వం, ముందు పియానో నేర్చుకున్నాడు. అలాగే ఫిల్మ్ ప్రొడక్షన్ గురించి కూడా నేర్చుకున్నాడు. యోగా, మార్షల్ ఆర్ట్స్, కిక్ బాక్సింగ్ ఇవన్నీ నేర్చుకున్నాడు, తనకి రైటింగ్ ఇష్టం అని ఒక స్క్రిప్ట్ కూడా రాశాడని అన్నారు. తను హీరో అవ్వాలని డిసైడ్ అయితే అందరికంటే ముందు నేనే ప్రకటిస్తానని అన్నారు. అయితే హీరో కావాలని ముందు తనకి అనిపించాలి, తను చూడటానికి అందంగా ఉంటాడు. ఒక నటుడికి కావాల్సిన అన్ని క్వాలిటీలు తనలో ఉన్నాయని ఆమె అన్నారు.