Rent Movie Pre Release Event: శివారెడ్డి, జాష్ణిని, వనిత రెడ్డి హీరో హీరోయిన్లుగా రఘు వర్ధన్ రెడ్డి దర్శకుడిగా తెరకెక్కిన తాజా చిత్రం రెంట్. జెఎంఎం జాగృతి మూవీ మేకర్స్ పతాకంపై బలగం జగదీష్ నిర్మించిన ఈ హారర్ థ్రిల్లర్ చిత్రం ఆగస్టు 25న విడుదల అవుతుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక ప్రసాద్ ల్యాబ్ లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా హీరో శివారెడ్డి మాట్లాడుతూ ఈ సినిమా దర్శకుడు నన్ను హీరోగా చేయమని అడిగినప్పుడు నేను హీరోగా చేయటం లేదని చెప్పాను, కానీ దర్శకుడి సంస్కారం, కథ నన్ను కట్టిపడేశాయి.
Manmadhudu Re Release Trailer: ఇందులో త్రివిక్రమ్ డైలాగ్స్ ఉంటాయి గురువు గారు.. వేరే లెవెల్ అంతే
వెంటనే సినిమా చేస్తా అని ఒప్పుకున్నా, మంచి థ్రిల్లింగ్ కథ, మంచి కామెడీ ఉంటుంది, యూత్ కి బాగా నచ్చుతుంది, మంచి యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయని అన్నారు. హీరోయిన్ జాష్ణిని మాట్లాడుతూ “నేను ఈ సినిమాలో పని చేయడం చాలా సంతోషంగా ఉందని, తెలుగులో ఇది నా మొదటి సినిమా అని అన్నారు. హీరోయిన్ వనిత రెడ్డి మాట్లాడుతూ “నాకు ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు తెలిపారు. హర్రర్ అండ్ రొమాంటిక్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ‘రెంట్’ నాట్ ఫర్ సేల్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుందని చెబుతున్నారు. ఈ సినిమాకి సంగీతం డి.ఎస్.ఆర్ అందించగా సినిమాటోగ్రఫీ హజరత్ (వలి) అందించారు.