నందమూరి బాలకృష్ణకు ‘అఖండ’ వంటి బ్లాక్‌బస్టర్‌ను అందించిన సక్సెస్ ఫుల్ డైరెక్టర్ బోయపాటి శ్రీను. ఆయన తదుపరి చిత్రం ఏమిటి అనే విషయంపై ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తోంది. ‘అఖండ’కు సీక్వెల్ తెరకెక్కుతోందని అంతా భావించారు. కానీ బాలయ్య ఇప్పటికే వరుస సినిమాలతో బిజీగా ఉండడంతో ఈ స్టార్ ఫిల్మ్ మేకర్ హీరో రామ్ తో సినిమా చేయబోతున్నాడట.
Read Also : “ఎఫ్ 3” ఫస్ట్ సింగిల్ ప్రోమో అవుట్
బోయపాటి శ్రీను రామ్ తో ఓ సినిమా చేస్తానని ఇంతకుముందు కమిట్‌మెంట్ ఇచ్చాడని, ఆ ప్రామిస్ ను ఇప్పుడు నిలబెట్టుకుంటున్నాడని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ స్టార్ డైరెక్టర్ కు ‘అఖండ’ హిట్ తో ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఆయన ఎంత అడిగితే అంత రెమ్యూనరేషన్ గా ఇవ్వడానికి నిర్మాతలు సిద్ధంగా ఉన్నారని టాక్ నడుస్తోంది. ప్రస్తుతం తన నెక్స్ట్ సినిమాకు బోయపాటి హీరో కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడట.
ఇక హీరో రామ్ ఈ సినిమాకి 9 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటే, బోయపాటి మాత్రం 12 కోట్ల భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడట. నిర్మాత శ్రీనివాస చిట్టూరి ఈ ప్రాజెక్ట్ ను నిర్మించనున్నాడని తెలుస్తోంది. దర్శకుడు లింగస్వామితో ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ప్రాజెక్ట్ ను పూర్తి చేశాక రామ్… బోయపాటి యాక్షన్ సినిమా చేయనున్నాడు. ఇక రామ్ తర్వాత ఈ స్టార్ డైరెక్టర్ అల్లు అర్జున్‌తో కూడా ఓ సినిమా చేసే అవకాశం ఉంది.