రాజా సాబ్ జరిగి జరిగి డిసెంబర్ నుండి కూడా వెళ్లిపోయాడు. నెక్ట్స్ ఇయర్ సంక్రాంతికి డార్లింగ్‌ను చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారని హింట్ ఇచ్చేసిన పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్.. మిరాయ్ ట్రైలర్ ఈవెంట్లో జనవరి 9న రాజా సాబ్ థియేటర్లలోకి వచ్చేస్తున్నాడంటూ చెప్పేశారు. యూనియన్ స్ట్రైక్ వల్ల కాస్త ఎఫెక్ట్ అయితే ఇప్పటికే షూటింగ్ పెండింగ్, ఇంకొంత పోస్ట్ ప్రొడక్షన్ కూడా సినిమా వాయిదా పడేందుకు కారణమైంది.
Also Read : Tollywood : కంటెంట్ ఆలస్యం.. మార్నింగ్ షోస్ క్యాన్సిల్ అయిన సూపర్ హిట్ సినిమా
ఇదిగో ఇలా రాజా సాబ్ వాయిదా పడిందన్న ఎనౌన్స్‌మెంట్ వచ్చిందో లేదో ఫ్యాన్స్ కాస్త హర్ట్ అయినా పొంగల్ బరిలో దిగుతున్నాడని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇదే రేసులో చిరంజీవి, నవీన్ పోలిశెట్టి కర్చీఫ్ రెడీ చేశారు. కానీ రాజా సాబ్‌కు మిగిలిన సినిమాలకు కాస్త గ్యాప్ ఉంది. ఇక కోలీవుడ్‌లో బిగ్గెస్ట్ క్లాష్ ఎదురవుతోంది. ఎందుకంటే అదే రోజు ఇళయదళపతి విజయ్ చివరి సినిమాగా చెప్పుకుంటున్న జననాయగన్ రిలీజ్ కాబోతుంది. నెక్ట్స్ ఇయర్ జనవరి 9నే వచ్చేస్తున్నట్లు ఎప్పుడో కర్చీఫ్ వేశాడు విజయ్. నెక్ట్స్ సంక్రాంతి దంగల్ కోలీవుడ్ వర్సెస్ టాలీవుడ్ అన్నట్లుగా మారింది. తెలుగులో ప్రభాస్‌దే డామినేట్ అందులో నో డౌట్ కానీ తమిళంలో విజయ్ మేనియాను తట్టుకుని నిలబడాల్సి ఉంది. అందులోనూ నెక్ట్స్ తెరపై విజయ్ కనిపించడన్న యాంగ్జైటీతో ఉన్న మ్యాడ్ ఫ్యాన్స్ జన నాయగన్ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. బాహుబలి2తో తమిళనాడులో క్రేజ్ సంపాదించుకున్న రెబల్ స్టార్ అక్కడ మాసివ్ కలెక్షన్స్ కొల్లగొడతాడా విజయ్ పొలిటికల్ ఎంట్రీకి ఎండ్ కార్డ్ వేస్తున్న సినిమా ముందు రాజా సాబ్ నిలబడగలగా విజయ్ రిస్క్ చేసి డార్లింగ్ ఆరాను తట్టుకుని బాలీవుడ్, టాలీవుడ్‌లో సినిమాను అదే రోజు దింపగలడా చూడాలి