RC 15: హీరోయిన్ పెళ్లి కారణంగా షూటింగ్ క్యాన్సిల్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ ప్రేమజంట కియారా అద్వానీ, సిద్దార్థ్ మల్హోత్రాల పెళ్లి జైసల్మర్ లో ‘సూర్యఘర్ ప్యాలెస్’లో గ్రాండ్ గా జరుగుతుంది. బాలీవుడ్ టాప్ సెలబ్రిటీస్ ఈ వెడ్డింగ్ కి అటెండ్ అవ్వడానికి ఇప్పటికే వెన్యు చేరుకున్నారు. ఫిబ్రవరి 6న జరగాల్సిన కియారా, సిద్దార్థ్ ల పెళ్లి ఫిబ్రవరి 7కి వాయిదా పడిందని బీటౌన్ మీడియా నుంచి వస్తున్న సమాచారం. అంబానీ ఫ్యామిలీ రాకకోసమే ఈ పెళ్లిని ఒకరోజు వాయిదా వేసారని నార్త్ లో వినిపిస్తున్న మాట. అయితే ఈ వెడ్డింగ్ ఇంపాక్ట్ రామ్ చరణ్ సినిమాపైన పడింది. రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా ‘RC 15’. చరణ్ డిఫరెంట్ షేడ్స్ ఉన్న డ్యూయల్ రోల్ లో నటిస్తున్న ఈ మూవీపై సినీ అభిమానుల్లో భారి అంచనాలు ఉన్నాయి. ఇందులో యంగ్ లుక్ లో చరణ్ కనిపించే పాత్రకి హీరోయిన్ గా కియారా అద్వానీ నటిస్తోంది.
Read Also: Allu Aravind: కాంట్రవర్షియల్ ప్రెస్ మీట్ క్యాన్సిల్ అవ్వడానికి కారణం అదేనా?
Also Read
ఈ సెమీ పీరియాడిక్ డ్రామాకి సంబంధించిన ఒక సాంగ్ షూటింగ్ ఈరోజు జరగాల్సి ఉంది. కియారా పెళ్లి కారణంగా షెడ్యూల్ ని చేంజ్ చేస్తూ సాంగ్ షూటింగ్ ని ఫిబ్రవరి 9కి వాయిదా వేసినట్లు సమాచారం. కియారా అద్వానీ జాయిన్ ‘RC 15’ షూటింగ్ మళ్లీ మొదలుకానుంది. ప్రతి నెలలో 12 రోజులు మాత్రమే RC 15 షూటింగ్ జరుగుతోంది, మిగిలిన రోజుల్లో శంకర్ ‘ఇండియన్ 2’ సినిమాని తెరకెక్కించే పనిలో ఉన్నాడు. శంకర్ ఇలా ఒకేసారి రెండు సినిమాల షూటింగ్స్ ని జరుపుతున్నాడు కాబట్టే RC 15 డిలే అవుతుందని మెగా అభిమానులు ఫీల్ అవుతున్నారు.
తాజావార్తలు
-
Suriya : కరుప్పు బ్లాక్ బస్టర్ జోష్..నెక్ట్స్ సినిమాలో పాట పడబోతున్న సూర్య
-
Mustard Oil Ban in US: భారత్‌లో హెల్దీ.. అమెరికాలో నిషేధం.. ఆవ నూనెపై నిజాలు ఇవే..!
-
Harshad Chopra: 43 ఏళ్ల వయసులోనూ ఎందుకు పెళ్లి చేసుకోలేదు?.. ప్రముఖ టీవీ నటుడు ఎమోషనల్ కామెంట్స్
-
Team India: టీమిండియాకు ఒక్క పరుగు షాక్.. ఇదేం మొదటిసారి కాదు!
-
iPhone 18 Launch Date: యాపిల్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఐఫోన్ 18 ప్రో లాంచ్ డేట్ లీక్..! ఫీచర్లు, ధరలు వైరల్..
ట్రెండింగ్
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్‌గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!