క్రియేటివ్ డైరెక్టర్ శంకర్, రామ్ చరణ్ తో RC 15 సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఫుల్ స్వింగ్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ పాన్ ఇండియా మూవీ ఇటివలే వైజాగ్ ప్రాంతంలో లేటెస్ట్ షెడ్యూల్ ని కంప్లీట్ చేసుకుంది. కియారా అద్వానీ, రామ్ చరణ్ పై డిజైన్ చేసిన చరణ్ ఇంట్రడక్షన్ సాంగ్ ని శంకర్ షూట్ చేశాడు. ఇక్కడితో RC 15 షూటింగ్ కి షెడ్యూల్ బ్రేక్ ఇచ్చిన శంకర్, మరో పాన్ ఇండియా సినిమా ‘ఇండియన్ 2’ సెట్స్ పైకి వెళ్ళిపోయాడు. శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్ లో వచ్చిన ఆల్ టైం క్లాసిక్స్ లో ఒకటైన ‘భారతీయుడు’ సినిమాకి సీక్వెల్ గా ‘ఇండియన్2’ తెరకెక్కుతోంది. ఇటివలే తిరుపతి ఒక షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ లేటెస్ట్ షెడ్యూల్ చెన్నైలో స్టార్ట్ అయ్యింది. నెల రోజుల పాటు జరగనున్న ఈ షెడ్యూల్ ని చెన్నైలోని ‘ఆదిత్యరామ్ స్టూడియో’లో ప్లాన్ చేశారు.
RC 15, ఇండియన్ 2 సినిమాల షూటింగ్స్ ని పారలెల్ గా చేస్తున్న శంకర్… ఒక్కో సినిమాకి 12 రోజుల చొప్పున రెస్ట్ లేకుండా వర్క్ చేస్తున్నాడు. ఇప్పుడు ఇంపార్టెంట్ షెడ్యూల్ కావడంతో ఇండియన్ 2 మూవీకే నెల మొత్తం కేటాయించి, కీ సీన్స్ ని తెరకెక్కిస్తున్నాడు. ఇండియన్ 2లో నటిస్తున్న మేజర్ కాస్ట్, ఈ షెడ్యూల్ లో పాల్గొననున్నారని కోలీవుడ్ వర్గాల టాక్. 30 రోజుల పాటు జరగనున్న ఇండియన్ 2 షెడ్యూల్ కంప్లీట్ అయ్యే సరికి మార్చ్ సెకండ్ వీక్ అవుతుంది. ఆ తర్వాత మార్చ్ లాస్ట్ వీక్ లో శంకర్ మళ్లీ రామ్ చరణ్ సినిమా షూట్ స్టార్ట్ చేస్తాడు. సినిమా సినిమాకి బాగా గ్యాప్ తీసుకోని వర్క్ చేసే శంకర్, ఇలా ఒకేసారి రెండు పాన్ ఇండియా సినిమాలని షూట్ చెయ్యడం అతని కెరీర్ లో ఇదే మొదటిసారి. కేవలం శంకర్ కెరీర్ లోనే కాదు, భారి బడ్జట్ సినిమా చేసే ఏ దర్శకుడు కూడా ఇలా ఒకేసారి రెండు హ్యుజ్ ప్రాజెక్ట్స్ ని చెయ్యడం ఇండియాలో ఇదే మొదటిసారి. మరి తన మార్కెట్ ని శంకర్ ఈ రెండు సినిమాలతో రివైవ్ చేస్తాడా లేదా అనేది చూడాలి.