Raviteja: తగ్గేదేలే.. మాస్ మహారాజా సంభవం లోడింగ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినిమా పోయింది.. ఇంటికెళ్లిపోతామా? సినిమా హిట్ అయింది.. తీయడం మానేస్తామా? సినిమా హిట్ అయినా, ఫ్లాప్ అయినా.. ఇంకో సినిమా చేయాల్సిందే! నేనింతే సినిమాలో రవితేజ చెప్పిన డైలాగ్ ఇది. అందుకే హిట్, ఫట్‌తో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు మాస్ మహారాజా రవితేజ. గతేడాది మూడు సినిమాలతో థియేటర్లోకి వచ్చిన రవితేజ.. ఈ ఏడాదిలో ఇప్పటికే రెండు సినిమాలతో అలరించాడు. అందులో వాల్తేరు వీరయ్య హిట్, రావణాసుర ఫట్. అయితే ఏంటి మరో కొత్త సినిమాతో దూసుకొస్తున్నాడు మాస్ రాజా కాకపోతే ఈసారి బౌండరీలని దాటి పాన్ ఇండియా టచ్‌తో వస్తున్నాడు. వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘టైగర్ నాగేశ్వరరావు’.. దసరా టార్గెట్‌గా అక్టోబర్ 20న రిలీజ్‌కు రెడీ అవుతోంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
Read Also:CBSE Class 12 Results: సీబీఎస్‌ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల.. రిజల్ట్ లింక్ ఇదే..
Also Read
మాస్ మహారాజా సంభవం లోడింగ్… టైగర్ నాగేశ్వర రావు ఫస్ట్ లుక్, రవితేజ ఫ్యాన్స్ గర్వపడేలా ఉంటుందని చెబుతున్నారు. అతి త్వరలోనే ఫస్ట్ లుక్‌ని రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేశారు. ఇదిలా ఉంటే.. సినిమా రిజల్ట్‌తో సబంధం లేకుండా దూసుకుపోతున్న మాస్ రాజా.. భారీగా పారితోషికం పెంచేసినట్టు తెలుస్తోంది. టైగర్ నాగేశ్వర రావు తర్వాత ‘ఈగల్’ అనే మూవీ చేస్తున్నాడు రవితేజ. అలాగే కలర్ ఫొటో డైరెక్టర్‌తో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ మూవీ కోసం రవితేజ ఏకంగా 25 కోట్లు డిమాండ్ చేస్తున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాలతో… మాస్ రాజా బాక్సాఫీస్ స్టామినా చూసిన మేకర్స్… రవితేజ ఎంత అడిగినా ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. మరి టైగర్ నాగేశ్వర రావుతో పాన్ ఇండియా హిట్ కొడితే రవితేజ ముప్పై కోట్ల హీరో అయిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
తాజావార్తలు
-
Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
-
Weather Update: ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ..
-
Jr NTR: జూనియర్ ఎన్టీఆర్‌కు తీవ్ర గాయం.. రేపే సర్జరీ!
-
Lal Darwaza Bonalu: బోనాల వేళ పోలీసుల సీక్రెట్ ఆపరేషన్.. 116 మంది అదుపులో..
-
Teacher Suspended: విద్యార్థినులతో లీలలు.. ప్రభుత్వ టీచర్ సస్పెండ్..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..