2022 ఇయర్ కి గ్రాండ్ క్లోజింగ్ ఇవ్వడానికి మాస్ మహారాజ్ రవితేజ ‘ధమాకా’ సినిమాతో ఆడియన్స్ ముందుకి వస్తున్నాడు. త్రినాథ్ రావు నక్కిన డైరెక్ట్ చేసిన ఈ మూవీ డిసెంబర్ 23న ఆడియన్స్ ముందుకి రానుంది. ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ లాంటి థ్రిల్లర్స్ లో నటించిన రవితేజ, తన ట్రేడ్ మార్క్ అయిన కమర్షియల్ సినిమా జానర్ లోకి వచ్చి చేస్తున్న ధమాకా మూవీపై రవితేజ అభిమానుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ మూవీతో రవితేజ కంబ్యాక్ ఇస్తాడని ఆయన ఫాన్స్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఇప్పటికే ధమాకా సినిమా నుంచి వచ్చిన సాంగ్స్ అన్నీ సూపర్ హిట్ అయ్యాయి.
రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ధమాకా మేకర్స్ ప్రమోషన్స్ కి స్టార్ట్ చేశారు. అగ్రెసివ్ గా జరుగుతున్న ప్రమోషన్స్ లో భాగంగా ఏ ప్రోగ్రాం చూసినా ధమాకా అండ్ టీం కనిపిస్తూనే ఉన్నారు. నెక్స్ట్ వీక్ కాష్ ఎపిసోడ్ కి ధమాకా డైరెక్టర్ అండ్ టీం వస్తుంటే, డాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ సెమీఫైనల్ కి రవితేజ ఛీఫ్ గెస్ట్ గా వస్తున్నాడు. ఇందుకు సంబంధించిన ప్రోమో బయటకి వచ్చి రవితేజ అభిమానులని ఆకట్టుకుంటోంది. రవితేజ ఎన్ని సినిమాలు చేసినా ప్రమోషన్స్ విషయంలో కాస్త స్లోగానే ఉంటాడు. ప్రీరిలీజ్ ఈవెంట్, రెగ్యులర్ ఇంటర్వ్యూస్ లో తప్ప బయట షోస్ లో రవితేజ కనిపించడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. అలాంటిది ధమాకా సినిమాని రవితేజ ‘ఢీ’ షోకి వచ్చి మరీ ప్రమోట్ చేయడం, ఆయన ఫాన్స్ లో జోష్ నింపుతుంది. ఇదే జోష్ ని డిసెంబర్ 23 వరకూ మైంటైన్ చేయగలిగితే ధమాకా సినిమాకి మంచి ఓపెనింగ్స్ రావడం గ్యారెంటీ.