Ravi Teja : రెండు నెలల్లో రెండు సినిమాలు… జోరు మీదున్న రవితేజ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ravi Teja : రెండు నెలల్లో రెండు కొత్త సినిమాలు. ఒకటి స్టార్ నిర్మాతతో, మరొకటి క్రేజీ దర్శకుడితో. వరుస ప్రాజెక్టులతో మళ్లీ ఫుల్ స్పీడ్‌లో దూసుకెళ్లేందుకు మాస్ మహారాజా రవితేజ సిద్ధమవుతున్నారు. గత కొంతకాలంగా ఆయన కొత్త సినిమాలపై పలు రకాల ఊహాగానాలు వినిపిస్తున్నా, ఇప్పుడు ఒక్కొక్కటిగా ప్రాజెక్టులు పట్టాలెక్కే దిశగా అడుగులు పడుతున్నాయి. ముఖ్యంగా ఆగస్టు, అక్టోబర్ నెలల్లో రెండు భారీ చిత్రాల షూటింగ్‌లు ప్రారంభం కానుండటంతో రవితేజ అభిమానుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.
సినీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ప్రముఖ నిర్మాత దిల్ రాజుతో రవితేజ చేయనున్న కొత్త సినిమా షూటింగ్ వచ్చే ఆగస్టు నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. కథ, నటీనటుల ఎంపిక, టెక్నికల్ టీమ్ ఖరారు వంటి పనులను పూర్తి చేసే దశలో చిత్రబృందం ఉన్నట్లు సమాచారం. దిల్ రాజు, రవితేజ కాంబినేషన్‌పై ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి. కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపొందనున్న ఈ చిత్రంలో రవితేజను మరోసారి అభిమానులు కోరుకునే మాస్ అవతారంలో చూపించే ప్రయత్నం జరుగుతోందని టాక్ వినిపిస్తోంది.
Also Read
- Maa Inti Bangaaram Day 1 Collections : 'మా ఇంటి బంగారం' ఫస్ట్ డే కలెక్షన్స్... అనుష్క, రష్మిక సినిమాలను మించిన వసూళ్లు
- OG 2 Update: చేతులు మారిన పవన్ కళ్యాణ్ 'ఓజీ 2'!
- Dhanush: మృణాల్ ఠాకూర్ ప్రేమకు బ్రేక్? డేటింగ్ రూమర్స్ తర్వాత కొత్త ట్విస్ట్ ఇదేనా!
- Toxic Update : ‘టాక్సిక్’ మళ్లీ ట్రాక్‌లోకి.. యష్ ఫ్యాన్స్ కోసం వచ్చే వారం సాలిడ్ సర్ప్రైజ్?
ఈ సినిమా ప్రారంభమైన రెండు నెలలకే రవితేజ మరో క్రేజీ ప్రాజెక్ట్‌ను కూడా మొదలుపెట్టనున్నట్లు సమాచారం. అక్టోబర్ నుంచి దర్శకుడు వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లేలా ప్లానింగ్ జరుగుతోంది. వినూత్నమైన శైలితో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వివేక్ ఆత్రేయ, మొదటిసారి రవితేజతో కలిసి పనిచేయబోతుండటం ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది. ఇప్పటివరకు వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన సినిమాలు కంటెంట్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వగా, రవితేజ ఇమేజ్‌కు తగ్గట్టుగా వినోదం, యాక్షన్, ఏమషన్స్ కలసి ఉండేలా కథను సిద్ధం చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
ఇటీవల రవితేజ సినిమాల ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోయినా, ఆయన మార్కెట్‌పై మాత్రం ఎలాంటి ప్రభావం పడలేదు. ఇప్పటికీ నిర్మాతలు, దర్శకులు ఆయనతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతుండటం అందుకు నిదర్శనంగా కనిపిస్తోంది. ఒకేసారి రెండు భారీ ప్రాజెక్టులను ప్రారంభించేందుకు సిద్ధమవుతుండటం, రాబోయే రోజుల్లో రవితేజ కెరీర్‌కు కొత్త ఊపు తీసుకురావొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అన్నీ అనుకున్నట్లే జరిగితే, ఆగస్టు నుంచి అక్టోబర్ మధ్యకాలంలో రవితేజ వరుసగా రెండు సినిమాలను ప్రారంభించి మరోసారి టాలీవుడ్లో తన జోరు కొనసాగించే అవకాశం కనిపిస్తోంది.
ప్రస్తుతం రవితేజ, దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్లో వస్తున్న క్రేజీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఇరుముడి’ ఆగస్ట్ 21, 2026న విడుదల కానుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా నటిస్తోంది. అయ్యప్ప స్వామి భక్తి, తండ్రి కూతుళ్ల సెంటిమెంట్ నేపథ్యంతో సాగే ఈ సినిమాకు జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా హిట్ అయితే ఆ రెండు సినిమాలకు మరింత క్రేజ్ వస్తుందనడంలో ఎలాంటి సందేహం ఉండదు.
తాజావార్తలు
-
Ravi Teja : రెండు నెలల్లో రెండు సినిమాలు… జోరు మీదున్న రవితేజ
-
Bike Shock Absorbers: బైక్ షాక్ అబ్జార్బర్లు ఎంతకాలం పనిచేస్తాయి? ఎప్పుడు మార్చాలి? ఖర్చు ఎంత?
-
Hyderabad: చిన్న పొరపాటు.. నిండు ప్రాణం బలి! పాము కాటుకు గురై వ్యాపారవేత్త మృతి..
-
APSP Constable: గోదావరిలో దూకిన ఏపీఎస్పీ కానిస్టేబుల్ మృతదేహం లభ్యం.. వేధింపులే కారణమా?
-
Faf du Plessis: 41 ఏళ్ల వయసులోనూ డు ప్లెసిస్ విధ్వంసం.. ప్రపచంలోనే తొలి ప్లేయర్‌గా రికార్డ్..
ట్రెండింగ్
-
Titanoboa: డైనోసార్ల తర్వాత భూమిని ఏలిన ‘టైటానోబోవా’.. ఈ అతిపెద్ద సర్పం గురించి షాకింగ్ విషయలు..
-
Kitchen Tips : గ్యాస్ స్టవ్ కడ్డీలపై జిడ్డా.? ఈ 2 చిట్కాలతో కొత్తలా మెరుస్తాయి.!
-
Freezer Cleaning Hacks: ఫ్రీజర్‌లో ఐస్ పేరుకుపోతోందా.? ఈ ట్రిక్స్‌తో నిమిషాల్లో క్లీన్.!
-
Food Grade Knives : తుప్పు కత్తులు వాడుతున్నారా.? ఇక భారీ మూల్యం చెల్లించాల్సిందే.!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!