Ravi Babu : రవిబాబు నటుడిగానే కాకుండా డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఆయన సినిమాలతో కొన్ని సార్లు కాంట్రవర్సీల్లో కూడా ఇరుక్కున్నాడు. తాజాగా ఆయన తన సినిమా విషయంలో జరిగిన ఓ వివాదం గురించి స్పందించారు. ఆయన డైరెక్షన్ లో వచ్చిన అవును సినిమా మంచి హిట్ అయింది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ కోసం హీరోయిన్ ను ఏనుగు పట్టుకున్నట్టు చూపించే పోస్టర్ ను రిలీజ్ చేశా. సినిమా చూసిన తర్వాత కొందరు నాకు ఫోన్లు చేసి రకరకాలుగా ప్రశ్నలు వేశారు.
Read Also : SKN : మహేశ్ బాబు అభిమాని కుటుంబానికి నిర్మాత భారీ సాయం
ఒక మహిళ ఫోన్ చేసి మహిళను ఏనుగు పట్టుకోవడం ఏంటని.. దీనికి దానికి సంబంధం ఏముందని ఫైర్ అయింది. హీరోయిన్ ఏనుగంత సమస్యలో ఉంది కాబట్టి దాన్ని విజువల్ రూపంలో చూపించేందుకు అలా డిజైన్ చేశానని చెప్పా. కానీ ఆమె వినిపించుకోలేదు. ఇంకో వ్యక్తి కాల్ చేసి పోస్టర్ లో ఏనుగు ఉందని పిల్లల్ని తీసుకెళ్తే సినిమాలో ఏనుగు లేదని కోప్పడ్డాడు. ఆయనకు సారీ చెప్పి పెట్టేశాడు. ఇంకో మహిళ కాల్ చేసి శరీరం లేని ఒక వ్యక్తి కళ్లకు కనిపించని వ్యక్తి హీరోయిన్‌ను ఎలా కలుస్తాడు అంటూ నన్ను తిట్టింది. నేను ఆమెకు పర్ ఫెక్ట్ గా ఆన్సర్ ఇవ్వలేకపోయా. మనం చెప్పే కొన్ని కథలను ప్రేక్షకులు డీప్ గా చూస్తారు. కాబట్టి వాళ్ల ప్రశ్నలకు కూడా మన దగ్గర సమాధానం ఉండాలి అన్నారు రవి బాబు.
Read Also : I Bomma Ravi : ఐ బొమ్మ రవి తొలిరోజు కస్టడీ.. కీలక విషయాలు రాబట్టిన పోలీసులు