టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా .. దేవరకొండ ఫ్యామిలీతో కలిసి న్యూ ఇయర్ వేడుకలు చేసుకుండా అంటే అవుననే అంటున్నారు నెటిజన్లు. గత కొన్ని రోజులుగా విజయ్ దేవరకొండ, రష్మిక రిలేషన్ లో ఉన్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇందుకు తగ్గట్టుగానే వారిద్దరూ బయట కెమెరా కంటపడుతుండడంతో వీరిద్దరి మధ్య ఏదో ఉంది అని ఫిక్స్ అయిపోయారు అభిమానులు. ఇక తాజాగా రష్మిక న్యూ ఇయర్ విషెస్ తెలుపుతూ ఒక ఫోటోను పోస్ట్ చేసింది.
పూల పూల డ్రెస్ లో రష్మిక ఫిదా చేస్తోంది. అయితే మరోపక్క చిన దేవరకొండ ఆనంద్ కూడా న్యూ ఇయర్ విషెస్ తెలుపుతూ ఒక ఫోటోను షేర్ చేశాడు. అయితే ఈ రెండు ఫొటోలలోని బ్యాక్ గ్రౌండ్ ఒకటే కావడం విశేషం. ఇక ఇది గమనించిన నెటిజన్స్.. దేవరకొండ ఫ్యామిలీతో రష్మిక న్యూ ఇయర్ వేడుకలు జరుపుకొందని, అంటే వారిద్దరూ రిలేషన్ లో ఉన్నది నిజమే అని నొక్కి వక్కాణినిస్తున్నారు. ఇకపోతే విజయ్ సైతం ఆ ప్రదేశంలో దిగిన ఫోటోలని షేర్ చేసి ఉండొచ్చని తెలుస్తోంది. మరి ఈ జంట త్వరలోనే పుకార్లకు చెక్ పెడతారా.. లేదా అనేది చూడాలి.