Rashmika: నేషనల్ క్రష్ కూడా లేడీ ఓరియెంటెడ్ చేసేస్తోంది…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయశాంతి, అనుష్క, నయనతార, సమంతా, దీపిక పదుకోణే… ఇలా చెప్పుకుంటూ పోతే సాలిడ్ ఫ్యాన్ బేస్ ఉన్న ప్రతి హీరోయిన్ సోలో ఫిల్మ్స్ చేసి హిట్స్ కొట్టింది. హీరోల పక్కన నటిస్తూనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసి తమకంటూ స్పెషల్ మార్కెట్ ని క్రియేట్ చేసుకున్న ఈ హీరోయిన్స్ పక్కన నేషనల్ క్రష్ రష్మిక మందన్న కూడా చేరబోతుంది. ఛలో సినిమాతో కన్నడ నుంచి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన రష్మిక, అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోల పక్కన నటిస్తూ నేషనల్ వైడ్ క్రేజ్ తెచ్చుకుంది. పుష్ప సినిమాతో రష్మిక క్రేజ్ మరింత పెరిగింది, ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న రష్మిక తెలుగు, తమిళ్, హిందీ అనే తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీల్లో సినిమాలు చేస్తోంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసే ఫ్యాన్ బేస్ వచ్చింది అనుకుందో లేక కథ నచ్చిందో తెలియదు కానీ రష్మిక ఎట్టకేలకు ఒక ఫీమేల్ సెంట్రిక్ సినిమా చెయ్యడానికి సిద్ధమయ్యింది.
‘రెయిన్బో’ అనే టైటిల్ తో తెలుగు తమిళ భాషల్లో రష్మిక లేడీ ఓరియెంటెడ్ సినిమా చేస్తోంది. ఈరోజే గ్రాండ్ గా లాంచ్ అయిన ఈ మూవీని డ్రీం వారియర్ పిక్చర్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఏప్రిల్ 7 నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానున్న ‘రెయిన్బో’ సినిమాని శాంతారూబెన్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కించనున్నాడు. మలయాళ నటుడు, శాకుంతలం సినిమాతో తెలుగు ఆడియన్స్ కి పరిచయమవనున్న ‘దేవ్ మోహన్’ ఈ మూవీ స్పెషల్ రోల్ ప్లే చెయ్యనున్నాడు. జస్టిన్ ప్రభాకరన్ మ్యూజిక్ అందిస్తున్న ‘రెయిన్బో’ సినిమాతో రష్మిక, నేషనల్ క్రష్ నుంచి సొంత మార్కెట్ క్రియేట్ చేసుకోని లేడీ సూపర్ స్టార్ గా ఎదుగుతుందేమో చూడాలి.
Also Read
- Maa Inti Bangaram: ఖుషీ అవుతున్న సమంత ఫాన్స్.. ‘మా ఇంటి బంగారం’ రిలీజ్ అప్పుడే!
- Peddi : ముంబైలో ట్రైలర్ లాంచ్, భోపాల్‌లో రెహమాన్ లైవ్ కాన్సర్ట్!
- CM Vijay: IMDb లిస్ట్‌ను షేక్ చేసిన తమిళనాడు సీఎం.. వారంలోనే టాప్-2లోకి 'దళపతి'! అసలేం జరిగిందంటే..
- Tollywood: ప్రొడ్యూసర్ కౌన్సిల్లో కలకలం..జాయింట్ సెక్రటరీ పదవికి నట్టి కుమార్ రాజీనామా!
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి వార్నింగ్ ఇచ్చిన ఏబీ డివిలియర్స్.. అది అంత ఈజీ కాదంటూ..
-
PM Modi: ఎల్లుండి నుంచి 5 విదేశాల్లో పర్యటించనున్న మోడీ
-
Maa Inti Bangaram: ఖుషీ అవుతున్న సమంత ఫాన్స్.. ‘మా ఇంటి బంగారం’ రిలీజ్ అప్పుడే!
-
Trump China Visit: చైనాలో ల్యాండైన ట్రంప్.. అగ్ర దేశాల భేటీపై ప్రపంచ దృష్టి..
-
Chanakya Niti: ఓర్వలేని చుట్టాలకు చెక్ పెట్టే చాణక్య నీతి.. రాబంధువుల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోండిలా!
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్‌ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!