నేషనల్ క్రష్ కిక్ రష్మిక మందన్న ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్ రేసులో దూసుకెళ్తోంది. అయితే ఆ రేసుకు తట్టుగానే ఫిట్నెస్ విషయంలోనూ చాలా కేర్ తీసుకుంటోంది. సోషల్ మీడియా ద్వారా తన రొటీన్ వర్క్ అవుట్స్ కు సంబంధించిన వీడియోలను షేర్ చేస్తూ అభిమానులకు స్పూర్తినిస్తూ ఉంటుంది. హై ఇంటెన్సిటీ వర్కౌట్ రొటీన్ అయినా లేదా కిక్‌బాక్సింగ్ అయినా రష్మిక చూపించే అంకితభావం వేరు. తాజాగా రష్మిక ఓ ఇంతెన్సె వర్క్ అవుట్ వీడియోను షేర్ చేసింది. ఫిజికల్ ఫిట్నెస్ కోసం ఆమె జిమ్‌లో చెమటలు పట్టిస్తున్న వీడియో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. రష్మిక ఈ వీడియోలో కార్డియో, స్క్వాట్‌లు, కిక్‌లు, హై జంప్‌లు మొదలైన వాటిని చేస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read Also : Amitabh Bachchan : ఏజ్ ఎంతైనా తగ్గేదే లే… డూప్ లేకుండా యాక్షన్ సీక్వెన్స్ !!
మరోవైపు రష్మిక మందన్న త్వరలో సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి స్పై థ్రిల్లర్ “మిషన్ మజ్ను”తో బీ-టౌన్ లోకి అడుగు పెట్టనుంది. ఈ మూవీ జూన్ 10 నుండి థియేటర్లలో ప్రేక్షకులకు అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత ఆమె అమితాబ్ బచ్చన్‌తో మరో హిందీ చిత్రం “గుడ్‌బై”లో కూడా కనిపించనుంది.