Rashmika : రీసెంట్ గా రష్మిక మీద ఓ రేంజ్ లో ట్రోల్స్ వచ్చాయి. ఆడవాళ్ల లాగే మగవారికి కూడా పీరియడ్స్ ఉంటే అప్పుడు ఆ బాధ వాళ్లకు తెలిసేదని ఆమె చేసిన కామెంట్స్ పెద్ద దుమారమే రేపాయి. రష్మిక మీద చాలా మంది నెటిజన్లు ఫైర్ అయ్యారు. మగవాళ్లు ఎంత కష్టపడుతున్నారో ఒకసారి చూడు.. ఫ్యామిలీని మొత్తం పోషించేది మగవారే అంటూ ఏకిపారేశారు. అసలు మగవారంటే ఎందుకంత చులకన అన్నట్టు ట్రోల్స్ చేశారు. ఈ ట్రోల్స్ పై తాజాగా ఆమె రియాక్ట్ అయింది. రష్మిక నటించిన లేటెస్ట్ మూవీ ది గర్ల్ ఫ్రెండ్. ఈ సినిమా మంచి విజయం సాధించింది. కలెక్షన్లు కూడా బాగానే వస్తున్నాయి. ప్రమోషన్లలో భాగంగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది.
Read Also : Vijay Devarakonda : వీలైనంత ఎంజాయ్ చేయండి.. విజయ్ కామెంట్స్ కు అర్థమేంటో
ఇందులో ట్రోల్స్ పై స్పందిస్తూ.. ‘నేను అందుకే ఇంటర్వ్యూలకు రాను. ఇంటర్వ్యూలకు వస్తే ఏదో ఒకటి అడుగుతారు. నేను చెప్పిన దాన్ని తప్పుగా అర్థం చేసుకుని నా మీద ట్రోల్స్ చేస్తారు. నేను మగవారికి పీరియడ్స్ రావాలన్న ఉద్దేశం వేరే. వాళ్లు అర్థం చేసుకున్నది వేరే. నా కామెంట్స్ ను తప్పుగా స్ప్రెడ్ చేశారు. అందులో ఎలాంటి దురుద్దేశం లేదు. ఇలాంటివి చూసినప్పుడే ఇంటర్వ్యూలకు రావాలంటే భయం వేస్తోంది అంటూ తెలిపింది రష్మిక. ఆమె చేసిన కామెంట్స్ పై ఇప్పటికే సోషల్ మీడియాలో జరగాల్సిన రచ్చ జరిగిపోయింది. ఇక రష్మిక నటించిన లేటెస్ట్ మూవీ ది గర్ల్ ఫ్రెండ్ వరుస ప్రమోషన్లలో రష్మిక చాలా బిజీగా ఉంటుంది.
Read Also : Nidhi Agarwal : 8 ప్లాపులు.. నిధి అగర్వాల్ కు ప్రభాస్ ఒక్కడే దిక్కు..