Rashmika : ఇప్పటిదాకా భరించా.. ఇక సహించేది లేదు: లీగల్ నోటీసులు పంపుతా..రష్మిక హెచ్చరిక!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోషల్ మీడియా వేదికగా గత కొన్నేళ్లుగా తనపై జరుగుతున్న వ్యక్తిగత దాడులు, అసత్య ప్రచారాలపై కన్నడ బ్యూటీ రష్మిక మందన్న ఎట్టకేలకు పెదవి విప్పింది. సుమారు ఎనిమిదేళ్లుగా తనపై దుష్ప్రచారం జరుగుతున్నప్పటికీ, ఓపికతో మౌనంగా ఉన్నానని కానీ ఇప్పుడు ఆ మౌనాన్ని వీడాల్సిన సమయం వచ్చిందని ఆమె స్పష్టం చేశారు. తాజాగా రష్మిక తల్లి సుమన్ మందన్నకు సంబంధించిన ఒక ఆడియో క్లిప్ లీక్ అవ్వడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఆడియో క్లిప్ ప్రకారం రష్మిక మరియు రక్షిత్ శెట్టిల మధ్య గొడవలకు ప్రధాన కారణం రష్మిక కెరీర్ అని, పెళ్లి తర్వాత రష్మిక సినిమాల్లో నటించకూడదని, నటనకు స్వస్తి చెప్పాలని రక్షిత్, అతని కుటుంబం డిమాండ్ చేసినట్లు సుమన్ మందన్న ఆరోపించారు. అంతేకాకుండా, సినిమాల్లో నటించనని రష్మిక సోషల్ మీడియా వేదికగా బహిరంగంగా ప్రకటించాలని కూడా వారు ఒత్తిడి తెచ్చినట్లు ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ‘గీత గోవిందం’ సినిమాలో విజయ్ దేవరకొండతో రష్మిక చేసిన ఒక కిస్సింగ్ సీన్ పట్ల రక్షిత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని ఆ ఆడియోలో ఉంది.
Also Read:Vijay: దళపతి విజయ్ కి మరో షాక్!
Also Read
- Dil Raju: న్యాచురల్ స్టార్ నానికి రూ.110 కోట్ల ఆఫర్ ఇచ్చిన దిల్ రాజు.. ఇది నిజమేనా?
- Kiran Abbavaram: నన్ను తిట్టారు.. కొట్టారు.. తన్నారు! కిరణ్ అబ్బవరం ఎమోషనల్ కామెంట్స్!
- #BanTheCensor: ఆర్జీవీ సంచలన పోస్ట్.. "ప్రేక్షకులను చిన్నపిల్లల్లా చూడొద్దు.. సెన్సార్ బోర్డును రద్దు చేయాలి"
- Jana Nayakudu: 'జన నాయకుడు' పోస్టర్‌తో అంచనాలు పెంచిన విజయ్.. జూలై 23న బాక్సాఫీస్‌పై దండయాత్ర!
ఇక ఇదే అంశం మీద రష్మిక తమ అభిమాన నటిగా తనను ఆదరిస్తున్న వారికి ధన్యవాదాలు తెలుపుతూనే, మరోవైపు మీడియాలోని ఒక వర్గం, సోషల్ మీడియాలో కొందరు వ్యక్తులు తనను లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. “నేను అనని మాటలను అన్నట్లుగా సృష్టించడం, నా వ్యాఖ్యలను సందర్భం లేకుండా వాడుతూ వ్యూస్ కోసం ద్వేషాన్ని పెంచడం చూసి చాలా బాధపడ్డాను, పబ్లిక్ లైఫ్ లో ఉన్నప్పుడు విమర్శలు సహజమే అని ఇప్పటిదాకా భరించాను” అని ఆమె పేర్కొన్నారు. తాజాగా గత 24 గంటల్లో జరిగిన కొన్ని పరిణామాలు గీత దాటాయని రష్మిక మండిపడ్డారు. ఎనిమిదేళ్ల క్రితం జరిగిన ఒక ప్రైవేట్ సంభాషణను, తన అనుమతి లేకుండా రికార్డ్ చేసి ఇప్పుడు లీక్ చేయడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తన వ్యక్తిగత జీవితంలోని పరిణామాలకు అనుగుణంగా, కావాలనే ఆ సంభాషణలోని ఒక చిన్న భాగాన్ని సందర్భం లేకుండా వాడుతూ వివాదాన్ని సృష్టిస్తున్నారని ఆమె వివరించారు. ఈ వ్యవహారంలోకి తన కుటుంబ సభ్యులను, తనతో స్నేహపూర్వకంగా ఉండేవారిని లాగడం అత్యంత దురదృష్టకరమని ఆమె అన్నారు.
Also Read:Monalisa: మాది లవ్ జిహాద్ కాదు..ప్రతి మతాన్ని సమానంగానే భావిస్తా!
వ్యక్తిగత గోప్యతను భంగపరిచే ఇలాంటి కంటెంట్ ను ప్రసారం చేస్తున్న మీడియా సంస్థలు, సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్లు వెంటనే వాటిని తొలగించాలని రష్మిక డిమాండ్ చేశారు. “ఈ ప్రకటన చేసిన 24 గంటల్లోగా ఆ కంటెంట్ ను తొలగించకపోతే, రేపటి నుండి చట్టపరమైన చర్యలు చేపడతాము. అవసరమైన వారికి లీగల్ నోటీసులు పంపుతాము” అని ఆమె హెచ్చరించారు. కన్నడ భాషలో కూడా ఒక సందేశాన్ని ఇస్తూ.. “నా వ్యక్తిగత జీవితం గురించి ఇష్టానుసారంగా మాట్లాడేవారు ఒకటి గుర్తుంచుకోవాలి. నా జీవితం ఎలా ఉండాలో నిర్ణయించేది వారు కాదు. నా జీవితం నాది, నా నిర్ణయాలు నేనే తీసుకుంటాను” అని గట్టిగా సమాధానం ఇచ్చారు.
— Rashmika Mandanna (@iamRashmika) March 12, 2026
తాజావార్తలు
-
Patna High Court: ‘‘సల్వార్ తీయడం, ఛాతీ నొక్కడం’’.. రేప్ అటెంప్ట్ కేసుపై హైకోర్టు కీలక తీర్పు..
-
Income Tax Notice: ఇదెక్కడి పాపం.. రోజుకు రూ.400 సంపాదించే కూలీకి ఐటీ శాఖ షాక్! అసలు ట్విస్ట్ ఇదే
-
SIR Extended: తెలంగాణలో సర్ పొడిగింపు.. ఏ తేదీ వరకంటే..
-
IRCTC: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఇక వేగంగా తత్కాల్!
-
Mudragada Padmanabham: ముద్రగడ పాడె మోసిన వైఎస్ జగన్.. అంత్యక్రియల్లో ఉద్రిక్తత
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్‌ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!