నేషనల్ క్రష్ రష్మిక మందన్న, టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్న రొమాంటిక్ మూవీ ‘ది గర్ల్‌ఫ్రెండ్’. ఈ సినిమాకు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఆయనకు ప్రేమ కథల మీద ఉన్న ప్రత్యేక నైపుణ్యం గురించి మనకు తెలిసిందే. ఆయన మునుపటి సినిమాల్లాగే, ఈ సినిమాకు రాహుల్ తన సున్నితమైన భావోద్వేగ టచ్, అందమైన కథన శైలితో ప్రేక్షకుల హృదయాలను ఆకట్టుకోబోతున్నాడు. గీతా ఆర్ట్స్ వంటి ప్రతిష్టాత్మక సంస్థతో కలిసి ఈ ప్రాజెక్ట్ రావడంతో, సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఇక ఈ మూవీ నవంబర్ 7న విడుదల కానుండటంతో.. టీం ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టింది.
Also Read : Ramya Krishna: నేను చేసిన ఐటెమ్ సాంగ్స్ అన్నీ మళ్లీ రీమేక్ చేయాలనుంది..
ఇందులో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో రష్మిక దర్శకుడు రాహుల్, హీరో దీక్షిత్ పాల్గోన్నగ, యాంకర్ రష్మిక ను ఆశ్చర్యపరిచే ప్రశ్న అడిగారు – ‘ఒకరిని ఒకరు కంట్రోల్ చేసుకోవడం ప్రేమేనా?’.. ముందుగా స్పందించిన డైరెక్టర్ రాహుల్.. ‘ఇది మోస్ట్ అన్‌హెల్తీ థింగ్. బంధంలో ఒకరిని ఒకరు కంట్రోల్ చేయడం సరి కాదు. చివరికి, ఆ బంధం పూర్తిగా తెగిపోతుంది’ అని చెప్పాడు. దీనికి వెంటనే రష్మిక సూటిగా సమాధానమిచ్చింది – ‘ఇది సాడ్ రియాలిటీ. చాలామందిలో ఒకరిని ఒకరు కంట్రోల్ చేసే అలవాటు ఉంది. చాలా సందర్భాల్లో ఒక వ్యక్తిని మరొక వ్యక్తి ‘ప్రాపర్టీ గా చూస్తారు. ప్రేమ అనేది గౌరవం, స్వేచ్ఛతో ఉండాలి. కంట్రోల్ చేయడం హెల్తీ కాదు’ అని సమాధానం ఇచ్చింది.
తర్వాత రాహుల్ కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన కాంట్రోవర్సీని వివరించారు.. “మన చుట్టూ ఇది చాలా కామన్ అయిపోయింది. ఉదాహరణకు, ఓ అమ్మాయి మోడ్రన్ డ్రస్ వేసి బయట వస్తే, వెంటనే ఆమె బాయ్‌ఫ్రెండ్‌ను పిలిచి ‘నీ గర్ల్‌ఫ్రెండ్‌ను కంట్రోల్ చేయలేవా?’ అని అడిగే పరిస్థితి సాధారణంగా మారిపోయింది” అని చెప్పారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి, యువత, అభిమానులు ప్రేమ, గౌరవం, స్వేచ్ఛ వంటి అంశాలపై చర్చను పెంచాయి. రష్మిక, డైరెక్టర్ రాహుల్ ఇచ్చిన ఈ స్పష్టమైన వ్యాఖ్యలు, బంధాల్లో కంట్రోల్ కలిగిన ప్రవర్తనను ఎదుర్కోవడానికి ఒక ముఖ్య సందేశంగా నిలిచాయి.