Gam Gam Ganesha: చిన్న దేవరకొండ ‘బృందావనివే’ సాంగ్ రిలీజ్ చేసిన రష్మిక మందన్న
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rashmika Mandanna launches Anand Deverakonda’s Gam Gam Ganesha Song: “బేబీ” సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఆనంద్ దేవరకొండ అదే ఉత్సాహంలో “గం..గం..గణేశా” మూవీతో మరో హిట్ అందుకునేందుకు రెడీ అవుతున్నాడు. యాక్షన్ కామెడీ జానర్ లో ఈ “గం..గం..గణేశా” సినిమాను హై-లైఫ్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై కేదార్ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు. ఉదయ్ బొమ్మిశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ “గం..గం..గణేశా” సినిమా నుంచి బృందావనివే లిరికల్ సాంగ్ ను స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న రిలీజ్ చేశారు. ఆనంద్ సూపర్ హిట్ ఫిల్మ్ “బేబి”లోని ప్రేమిస్తున్నా సాంగ్ కూడా రష్మిక విడుదల చేసింది, ఆ సాంగ్ లానే ఈ బృందావనివే పాట బిగ్ హిట్ కావాలని రష్మిక బెస్ట్ విషెస్ తెలియజేశారు.
Chicken Song: ‘చికెన్ సాంగ్’ని విన్నారా.. నోరూరిపోవడం ఖాయం!
Also Read
- Irumudi : 'ఇరుముడి' అడవి సీక్రెట్ చెప్పేసిన శివ నిర్వాణ!
- Shiva Nirvana : నెక్స్ట్ సినిమా ధనుష్తోనా? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ
- Ashok Kumar : ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికల్లో ట్విస్ట్.. అశోక్ కుమార్ సంచలన ఆరోపణలు
- Dear You: రూ.132 కోట్ల బడ్జెట్.. రూ.2,849 కోట్ల వసూళ్లు.. ఈ చైనీస్ సినిమా వెనుక అసలు కథ ఇదే!
చేతన్ భరద్వాజ్ కంపోజ్ చేసిన బృందావనివే పాటకు వెంగి సుధాకర్ లిరిక్స్ అందించగా సిధ్ శ్రీరామ్ తో కలిసి చేతన్ భరద్వాజ్ ఈ పాట పాడారు. ‘బృందావనివే యవ్వనివే నీవే, నా మనసే నీ వశమే రా, ప్రేయసివే ఊర్వశివే నీవే, ఆరాధనమైనావే…’ అంటూ మంచి లవ్ ఫీల్ తో బ్యూటిఫుల్ మెలోడీతో సాగుతూ ఆకట్టుకుంటోందీ పాట. ఇక ఈ “గం..గం..గణేశా” త్వరలో థియేటర్స్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆనంద్ దేవరకొండ, ప్రగతి శ్రీవాస్తవ, నయన్ సారిక హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో వెన్నెల కిషోర్, జబర్దస్త్ ఇమాన్యూయల్,సత్యం రాజేష్,రాజ్ అర్జున్ తదితరులు కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఆదిత్య జవ్వాడి సినిమాటోగ్రఫీ అందించిన ఈ సినిమాకి చేతన్ భరద్వాజ్ సంగీతం అందించారు. ఇక ఈ సినిమాతో కూడా హిట్ అందుకుంటానని ధీమాగా ఉన్నాడు ఆనంద్ దేవరకొండ.
తాజావార్తలు
-
Razesh Danda : నిద్ర లేదు.. చాలా టెన్షన్ పడ్డాం!
-
Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
-
Irumudi : ‘ఇరుముడి’ అడవి సీక్రెట్ చెప్పేసిన శివ నిర్వాణ!
-
Shiva Nirvana : నెక్స్ట్ సినిమా ధనుష్తోనా? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ
-
ICC Cricket World Cup 2027: ప్రపంచకప్‌లో టీమ్ఇండియా ఎక్స్‌ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్‌ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!