Chicken Song From Sagileti Katha Released: యూట్యూబర్ రవి మహాదాస్యం, విషిక లక్ష్మణ్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ‘సగిలేటి కథ’ రిలీజ్ కి రెడీ అవుతోంది. రాయలసీమ పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ సినిమాకి రాజశేఖర్ సుద్మూన్ దర్శకత్వం వహించగా హీరో నవదీప్ సి-స్పేస్ సమర్పణలో, షేడ్ ఎంటర్టైన్మెంట్, అశోక్ ఆర్ట్స్ బ్యానర్‌లో దేవీప్రసాద్ బలివాడ, అశోక్ మిట్టపల్లి సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన తెచ్చుకోవడంతో పాటు, ఇప్పటికే విడుదలైన సాంగ్స్ కి కూడా మంచి స్పందన వస్తోంది. ఇక తాజాగా ఈ సినిమాలో కథకి ఎంతో కీలకమైన ‘చికెన్’ సాంగ్ ని ‘కోడి కూర చిట్టి గారే’ రెస్టారెంట్ లో లాంచ్ చేశారు. హీరో నవదీప్ ఆధ్వర్యంలో టాలీవుడ్ సక్సెస్ ఫుల్ యంగ్ డైరెక్టర్స్ ‘బేబీ’ సాయి రాజేష్, ‘కేర్ ఆఫ్ కంచరపాలెం’ వెంకటేష్ మహా, ‘కలర్ ఫోటో’ సందీప్ రాజ్ ముఖ్య అతిథులుగా విచ్చేసి ర్ ‘చికెన్’ సాంగ్ ని విడుదల చేశారు.
Rules Ranjann: మనోరంజన్ రూల్స్ రంజన్‌గా ఎలా మారతాడు?
ఇక ఈ క్రమంలో హీరో నవదీప్ మాట్లాడుతూ మా సి స్పేస్ ద్వారా ఇలాంటి కంటెంట్ ఉన్న ప్రాజెక్ట్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నందుకు మా టీమ్ అందరు చాలా హ్యాపీగా ఉన్నారని అన్నారు. ఈ సినిమాలో రోషం రాజు క్యారెక్టర్ నాకు ఇష్టం అని, అలాగే ఈ సినిమాలో కామెడీ అందరిని నవ్విస్తుందని అన్నారు. ప్రతి ఒక్కరు ఈ సినిమా చూశాక వెజిటేరియన్ వాళ్లకి కూడా చికెన్ తినాలనిపిస్తుందని అన్నారు. మా మూవీ అక్టోబర్ 13న ప్రేక్షకుల ముందుకు వస్తుందని పేర్కొన్న ఆయన ప్రతి ఒక్కరు థియేటర్ కి వచ్చి మా టీమ్ ని బ్లెస్ చేస్తారని కోరుకుంటున్నానని అన్నారు.