Baby: మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఎస్.కె.ఎన్. నిర్మాణంలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘బేబీ’. సాయి రాజేశ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే రెండు పాటలు విడుదలై మంచి విజయాన్ని అందుకున్నాయి. తాజాగా ‘ప్రేమిస్తున్నా’ అనే మూడో పాటను మంగళవారం విడుదల చేశారు. ఈ పాటను నేషనల్ క్రష్ రష్మిక మందణ్ణ ఆవిష్కరించింది. అనంతరం దర్శకుడు మారుతి మాట్లాడుతూ, “ఒక్కో సాంగ్, ఒక్కో ప్రమోషన్ జనాల్లోకి రీచ్ అవుతోంది. ఒక్కో పాటకు మిలియన్ల వ్యూస్ వస్తున్నాయి. ఆడియెన్స్‌ను ఈ పాటలు ఇంతగా ఆకట్టుకోవడం చాలా గొప్ప విషయం. ఆర్గానిక్ లవ్ స్టోరీస్ చాలా అరుదుగా వస్తుంటాయి. ఇలాంటి గొప్ప కంటెంట్‌ను సాయి రాజేష్ ఈ తరానికి అందించబోతున్నారు” అని అన్నారు. ‘కలర్ ఫోటో’ ఫేమ్ సందీప్ రాజ్ మాట్లాడుతూ, “ఇది నాకు స్పెషల్ ఈవెంట్. ‘కలర్ ఫోటో’ సినిమా రిలీజ్ అయిన తరువాత వచ్చిన 25వ ఈవెంట్ ఇది. రకరకాలుగా ప్రమోషన్స్ చేస్తూ పాటలను రిలీజ్ చేస్తున్నారు. ఒక్కో పాట, ఒక్కో పోస్టర్‌ను ఎంతో క్రియేటివ్‌గా ప్రమోట్ చేస్తున్నారు. కలెక్షన్ల గురించి మేం మాట్లాడుకుంటున్నాం. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది. చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్” అని అన్నారు. డైరెక్టర్ సాయి రాజేష్ మాట్లాడుతూ.. “రష్మిక లాంటి స్టార్ హీరోయిన్ ఈ పాటను ప్రమోట్ చేయడం అవసరం. మా కోసం వచ్చిన ఆమెకు థాంక్స్. మంచి పాట… మంచి సింగర్లను కోరుకుంటుంది. ‘గెలుపు తలుపులే…’ పాట లాంటిది మళ్లీ ఎందుకు పాడలేదని శ్రీరామచంద్ర గురించి అనుకుంటూ ఉండేవాడిని. రోహిత్ చాలా టాలెంటెడ్ సింగర్. ఇప్పుడు ఆయనకు సరైన టైం వచ్చింది. లిరిక్ రైటర్ సురేష్ ‘బేబీ’లో మూడు పాటలు రాశారు. ఇది రాసింది కూడా ఆయనే. మూవీ ప్రమోషన్స్ కోసం ఇంత డబ్బు ఖర్చు పెడుతున్న మా ఎస్.కే.ఎన్., మారుతి గారికి థాంక్స్. కచ్చితంగా ఈ పాట బ్లాక్ బస్టర్ అవుతుందని నమ్ముతున్నాను. ఈ సినిమాను జూలై 14న రిలీజ్ చేయబోతోన్నాం” అని అన్నారు.
రష్మిక మందణ్ణ మాట్లాడుతూ.. “ఈ రోజు రిలీజ్ చేసిన సాంగ్ నాకు బాగా నచ్చింది. దీనికి ముందు విడుదలైన ‘ఓ రెండు ప్రేమ మేఘాలిలా…’ అనే పాటను లూప్ మోడ్‌లో వింటూనే ఉన్నాను. ఆనంద్ మ్యూజిక్ టేస్ట్‌కు నేను ఫ్యాన్. ‘బేబీ’ టీంకు ఆల్ ది బెస్ట్. విరాజ్, వైష్ణవికి కంగ్రాట్స్. నన్ను ఈవెంట్‌కు పిలిచినందుకు టీంకు థాంక్స్” అని అన్నారు. ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ, “ఇది మ్యూజికల్ ఫిల్మ్. అందరికీ కచ్చితంగా నచ్చుతుంది. ఓ నలభై, యాభై ఏళ్ల తరువాత కూడా ఈ సినిమాలోని పాటలను వింటారు” అని అన్నారు. నిర్మాత ఎస్‌కేఎన్ మాట్లాడుతూ.. “ఈ సినిమాకు ఇంత మంచి మ్యూజిక్ రావడానికి కారణం విజయ్ బుల్గానిన్. ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’ మూవీ ఫంక్షన్ కు వెళ్ళినప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సంగీత దర్శకుడు విజయ్ గురించి మంచిగా చెప్పారు. అప్పుడే ఆయనతో పని చేయాలని ఫిక్స్ అయ్యాను. విజయ్ టాలెంట్ వల్లే ఈ సినిమా పాటలు ఇంతగా హిట్ అయ్యాయి” అని చెప్పారు. విరాజ్ అశ్విన్ మాట్లాడుతూ, “గతంలో రిలీజ్ చేసిన రెండు పాటలను హిట్ చేశారు. ఈ మూడో పాటను కూడా హిట్ చేస్తారని అనుకుంటున్నాను. నా మొదటి సినిమా రిలీజ్ టైంలోనూ రష్మిక ట్వీట్ వేశారు. ఈ రోజు మా పాటను రిలీజ్ చేసిన రష్మిక కు థాంక్స్. లిరిక్ రైటర్ సురేష్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ గారు, సింగర్ రోహిత్ గారు ఈ రోజు మా హీరోలు” అని అన్నారు. ఈ సినిమా కచ్చితంగా అందరి హృదయాలను దోచుకుంటుందనే విశ్వాసాన్ని వైష్ణవి చైతన్య వెలుబుచ్చింది. ఈ పాటతో తన కెరీర్ మలుపు తిరుగుతుందని భావిస్తున్నట్టు గీత రచయిత సురేశ్ ఆశాభావం వ్యక్తం చేశాడు. మంచి పాట పాడి తన పేరు నిలబెడతానని తల్లికి మాట ఇచ్చానని, ఆ మాటను ఈ పాటతో నిలబెట్టుకునేలా చేసిన రాజేశ్ కు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానని సింగర్ రోహిత్ అన్నాడు. దర్శకుడు సాయిరాజేశ్ చక్కని సందర్భాన్ని క్రియేట్ చేయడం వల్లే… దానికి తగ్గట్టుగా మంచి పాటలు వచ్చాయని సంగీత దర్శకుడు విజయ్ బుల్గానిన్ తెలిపారు.