Rashmika : రష్మిక ఇప్పుడు వరుస సినిమాలతో ఫుల్ జోష్ లో ఉంది. తాజాగా ఆమె నటిస్తున్న ది గర్ల్ ఫ్రెండ్ సినిమా నవంబర్ 7న రిలీజ్ కాబోతోంది. రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో దీక్షిత్ శెట్టి హీరోగా నటించాడు. మూవీ ప్రమోషన్లలో రష్మిక ఫుల్ జోష్ తో పాల్గొంటుంది. తాజాగా ఈవెంట్ లో విజయ్ దేవరకొండతో నటించిన డియర్ కామ్రేడ్ సినిమాపై స్పందించింది. ఆ మూవీ తనకు ఎంతో స్పెషల్ అని.. కానీ అప్పుడు పెద్దగా దానికి క్రేజ్ దక్కలేదని ఇప్పుడు యూట్యూబ్లో అందరూ దేని గురించే మాట్లాడుకుంటున్నారు అంటూ చెప్పుకొచ్చింది. కానీ తన దృష్టిలో అదొక గొప్ప సినిమా అంటూ వెల్లడించింది.
Read Also : Mass Jathara : ఇది పెద్ద హిట్ అవుతుంది రాసిపెట్టుకోండి.. రవితేజ స్టేట్ మెంట్
ఈవెంట్ లో కొందరు విజయ్ దేవరకొండ తో జరిగిన ఎంగేజ్మెంట్ గురించి అడిగారు. దీనిపై రష్మిక క్రేజీ ఆన్సర్ ఇచ్చింది. ఎప్పుడు చెప్పాలో అప్పుడే చెబుతా ఈ విషయంలో మీకు ఏమనిపిస్తుందో అదే నిజం.. అంటూ తెలిపింది. ఆమె మాటలను బట్టి చూస్తుంటే నిజంగానే విజయ్ దేవరకొండ తో ఎంగేజ్మెంట్ జరిగినట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఇంత పెద్ద విషయంలో ఆమె ఇలా మాట్లాడదు కదా. నిజం కాకపోతే ఒకవేళ అదంతా అబద్ధం అని కొట్టి పారేసేది. పైగా మీకు ఏమనిపిస్తుందో అదే నిజం అని చెప్పిందంటే ఫ్యాన్స్ ఊహాగానాలు నిజమే అని ఆమె చెప్పకనే చెప్పిందన్నమాట. ఆమె కామెంట్స్ ఎప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన వారంతా రష్మిక, విజయ్ దేవరకొండ కు కంగ్రాట్స్ చెబుతూ పోస్టుల మీద పోస్టులు పెట్టేస్తున్నారు.
Read Also : Mass Jathara : అలా జరగకుంటే ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోతా.. రాజేంద్ర ప్రసాద్ ఛాలెంజ్
