Rashmika : నేషనల్ క్రష్ రష్మిక ఫుల్ బిజీగా గడుపుతోంది. వరుసగా పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతోంది. తాజాగా ఆమె సల్మాన్ ఖాన్ తో సికిందర్ సినిమాలో నటిస్తోంది. మురుగదాస్ డైరెక్షన్ల ఓ వచ్చిన ఈ మూవీ ఈ మూవీ మార్చి 30న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్లు జోరుగా చేస్తున్నారు. తాజాగా రష్మిక, సల్మాన్ ఖాన్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో రష్మిక తన కెరీర్ గురించి మాట్లాడింది. తన లైఫ్ లో చేసిన అన్ని పనులకు తానే కారణం అని తెలిపింది. తనకు ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేదని.. కేవలం వర్క్ ను నమ్ముకుని వచ్చినట్టు తెలిపింది ఈ ముద్దుగుమ్మ. కన్నడ నుంచే తన ప్రయాణం మొదలైందని చెప్పుకొచ్చింది.
Read Also : MI vs GT: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ముంబై.. జట్టులోకి హార్ధిక్
‘నేను ఒక పుస్తకంలో ఒక లైన్ చదివాను. మనం ఏ స్థాయిలో ఉన్నా సరే దానికి కారణం మనం తీసుకునే నిర్ణయాలే అని. నేను కూడా నా కెరీర్ లో చేసిన ప్రతి సినిమా నా నిర్ణయమే. నాకు ఎవరి సలహాలు, సూచనలు ఏమీ లేవు. ప్రతిసారి ఒక కొత్త పాఠం నేర్చుకుంటాను. ఒక్కో సినిమా నాకు ఒక్కో ఎక్స్ పీరియన్స్. అసలు ఎలాంటి సినిమాలు చేయాలి, ఎలాంటి పాత్రలు చేయాలి అనే రూల్స్ ఏమీ పెట్టుకోలేదు. నాకు కథ నచ్చితే చాలు. సినిమా చేసేస్తాను. నా లైఫ్ లో పోటీ గురించి నేను అస్సలు పట్టించుకోను. ఎందుకంటే అందరం పనిచేస్తూ వెళ్లాలి. అదే మనల్ని ముందుకు నడిపిస్తుందని నేను నమ్ముతుంటాను’ అని రష్మిక తెలిపింది. అయితే రష్మిక చెప్పిన పోటీ లైన్ పై సల్మాన్ క్లారిటీ ఇచ్చారు. లైఫ్ లో పోటీ అనేది కచ్చితంగా ఉండాలన్నారు. అది ఉన్నప్పుడే మనల్ని మనం షార్ప్ గా చేసుకుంటామన్నారు.