‘RAPO23’ లో ఊహించని ట్విస్ట్ ఇదేనట! విలన్‌గా ఆ సీనియర్ స్టార్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RAPO23: ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటిస్తూ, తొలిసారి దర్శకత్వ బాధ్యతలు చేపట్టిన చిత్రం ‘RAPO23’. అంతర్జాతీయ పురుషుల దినోత్సవం సందర్భంగా విడుదలైన ఈ సినిమా ప్రీ-లుక్ పోస్టర్ ఇప్పటికే సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. బ్లాక్ అవుట్‌ఫిట్‌లో వెనుకకు తిరిగి నిలబడి, ఒక చేతిలో తుపాకీ, మరో చేతిలో టెడ్డీ బేర్ పట్టుకుని “లోన్ వుల్ఫ్” గా కనిపించిన రామ్ లుక్ కథపై భిన్నమైన అంచనాలను క్రియేట్ చేసింది. అయితే, ఈ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌లో ఊహించని ట్విస్ట్ ఒకటి ఉందని టాలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఈ సినిమాలో రామ్ పోతినేనికి ప్రతినాయకుడిగా బాలీవుడ్ సీనియర్ నటుడు జాకీ ష్రాఫ్ నటిస్తున్నారనే వార్త ఇప్పుడు ఫిల్మ్ నగర్లో వైరల్ అవుతోంది. ఇందులో ఆయన చాలా పవర్ఫుల్ నెగటివ్ రోల్ చేస్తున్నారని, ఇప్పటికే ఆయనపై కొన్ని కీలక సన్నివేశాలను కూడా చిత్రీకరించారని తెలుస్తోంది. హీరోగా, దర్శకుడిగా వ్యవహరిస్తున్న రామ్, సీనియర్ స్టార్ జాకీ ష్రాఫ్ మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని అంటున్నారు. అయితే, ఆయన ఎంట్రీపై చిత్రయూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Also Read
రాపో సినిమాటిక్స్ పతాకంపై కృష్ణ పోతినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రామ్ స్వయంగా కథ అందించి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో సంయుక్త మీనన్ హీరోయిన్గా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్‌ముఖ్ ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఒకవైపు గన్, మరోవైపు టెడ్డీ బేర్‌తో వెరైటీ కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ చిత్రం టైటిల్ టీజర్‌ను త్వరలోనే విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మరి డైరెక్టర్‌గా మారిన రామ్, జాకీ ష్రాఫ్ వంటి సీనియర్ నటుడిని విలన్‌గా పెట్టి ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-6 Live: ఆరో రోజు వేడుకలు.. నేటి ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు..
-
‘RAPO23’ లో ఊహించని ట్విస్ట్ ఇదేనట! విలన్‌గా ఆ సీనియర్ స్టార్?
-
TG SAFE: హైదరాబాద్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారుల కొరడా.. కరాచీ బేకరీ సహా పలు మాంస విక్రయ కేంద్రాలపై మెరుపు దాడులు!
-
CM Revanth Reddy : రాష్ట్ర హక్కుల కోసం రాజీలేని పోరాటం.. కేసీఆర్, హరీష్‌పై సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
-
ENE 2: ‘ఈ నగరానికి ఏమైంది’ అప్పుడు జరిగిన ఆ అవమానాన్ని బయటపెట్టిన విశ్వక్ సేన్ గ్యాంగ్!
-
Bangladesh: భారత్ నుంచే చుక్కలు చూపిస్తున్న హసీనా.. బంగ్లాదేశ్‌లో లాక్డౌన్!
ట్రెండింగ్
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!