Rangabali Parody Interview part 1 goes Viral: సరైన హిట్ కోసం విపరీతంగా ఎదురుచూస్తున్న నాగశౌర్య హీరోగా నటించిన రంగబలి సినిమా జూలై 7న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా సినిమా యూనిట్ అయితే వినూత్నంగా ఈ సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. మామూలుగా ఏదైనా సినిమా విడుదలకు ముందు మీడియా ఇంటర్వ్యూలు ఇవ్వడం కామన్ కానీ ఈసారి భిన్నంగా ఆలోచించి ఈ సినిమాలో భాగమైన కమెడియన్ సత్య, నాగశౌర్యలతో కలిసి కొత్తగా పేరడీ ఇంటర్వ్యూ చేయించి ప్రోమో వదిలారు. ఆ ప్రోమోలో ఏకంగా తెలుగులో ఉన్న ఒక ఐదుగురు పేరున్న జర్నలిస్టులను టార్గెట్ చేయడంతో అందరికీ ఫుల్ ఇంటర్వ్యూ మీద ఆసక్తి ఏర్పడింది. అయితే ఈ ఇంటర్వ్యూలో చూపిన కొందరు ఇంటర్వ్యూని విడుదల చేయకూడదని అడ్దకున్నట్లు వార్తలు రాగా వాటిని తోసిపుచ్చుతూ మేకర్స్ ఇంటర్వ్యూ పార్ట్ 1ని విడుదల చేశారు.
Samantha: మళ్ళీ ప్రేమలో సమంత.. ఆ పోస్టుకు అర్థం అదేనా?
ఈ పార్ట్ లో ఓపెన్ హార్ట్ విత్ సత్య, ఇంటర్వ్యూ విత్ దేవి ప్రియ అంటూ మనం రోజూ చూసే ఇద్దరు వివాదాస్పద జర్నలిస్టులను ఇమిటేట్ చేసిన సత్య కడుపుబ్బా నవ్వించాడు. జర్నలిస్టులు ఎలా అయితే హీరోలను ప్రశ్నలు అడుగుతారో అలా వాళ్ళ హావభావాలతో సహా మక్కీకి మక్కీ దించేసిన సత్య వాళ్ళు అడిగినట్టుగానే తిక్క తిక్క ప్రశ్నలు అడుగుతూ నాగశౌర్యని ఆటపట్టించారు. ఇక రంగబలి అంటే ఏంటి విజయవాడలో పాత గొడవలు మళ్ళీ రేపుదామనా? రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం ఉందా? అంటూ ఆసక్తికరంగా సాగింది ఈ పార్ట్. అయితే ఇది కేవలం వినోదం కోసం మాత్రమే చేసిన వీడియో అని.. జర్నలిస్ట్ అంటే తమకు గౌరవం ఉందని డిస్క్లైమర్ వేసి సినిమా టీమ్ సేఫ్ అయింది. ఇంకెందుకు ఆలస్యం ఆ వీడియో మీరూ చూసేయండి బాసూ