Samantha Intresting post on Love : అక్కినేని హీరో నాగ చైతన్యను ప్రేమించి వివాహం చేసుకున్న సమంత రూత్ ప్రభు ఆ తర్వాత ఎక్కువ కాలం కలిసి ఉండలేకపోయారు. వీరి మధ్య విభేదాలు ఏర్పడ్డాయని త్వరలోనే విడిపోతున్నారు అనే ప్రచారం అనే పద్యంలో 2021 అక్టోబర్లో వీరు అధికారికంగా విడిపోతున్నట్లు ప్రకటించారు. తర్వాత వివాహ బంధం గురించి అనేక చర్చలు కూడా జరిగాయి. ఈ పెళ్లి పెటాకులు అవ్వడంతో సమంత తప్పని కొందరు నాగచైతన్య తప్పని కొందరు రకరకాల ప్రచారాలు తెర మీదకు తీసుకొచ్చారు. ఏదైతేనేం వీరిద్దరూ విడిపోయి ఎవరికి వారు సినిమాలు చేసుకుంటున్నారు. సమంతకు విడాకుల తర్వాత సరైన హిట్ ఒక్కటి కూడా పడలేదు. నాగ చైతన్య పరిస్థితి కూడా దాదాపు అలాగే ఉంది.
Mouni Roy Photos: ఉల్లిపొర లాంటి గ్రీన్ శారీలో జిగేల్‌మనిపిస్తున్న మౌని రాయ్
అయితే విడాకుల తర్వాత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అయిపోయిన సమంత రూత్ ప్రభు ఎప్పటికప్పుడు తన భావాలను, తన అనుభవాలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ వస్తోంది. ఎప్పటికప్పుడు ఇంస్టాగ్రామ్ వేదికగా అనేక లవ్ కొటేషన్లు చేస్తూ వస్తున్న సమంత తాజాగా ప్రేమ గురించి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి. హీరోయిన్ సమంత ఇన్స్టాలో ప్రేమకు సంబంధించిన ఒక కొటేషన్ ను షేర్ చేయగా అది ఆసక్తికరంగా మారింది. ‘మరణం నుంచి మనల్ని ఏదీ కాపాడలేదు, కనీసం ప్రేమతో అయినా జీవితాన్ని కాపాడుకోవాలి’ అని చిలీ రచయిత పాబ్లో నెరుడా చెప్పిన కొటేషన్ ను ఆమె షేర్ చేశారు. ఇంకేముంది దున్నపోతు ఈనింది అంటే దూడను కట్టేయమనే వాళ్ళు ఇప్పుడు ఏకంగా ఆమె మళ్లీ ప్రేమలో పడ్డారనే ప్రచారం మొదలు పెట్టేశారు. నాగ చైతన్యతో విడాకుల తర్వాత ఒంటరిగానే ఉంటున్న ఆమె ఇటీవల మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారిన పడి కోలుకుని తన లైఫ్ లో బిజీ అవుతోంది.
Samantha Instagram Story