టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ భారీ క్లాష్ లకు సిద్ధమవుతోంది. తాజాగా మెగా హీరో ‘మేజర్’ను ఢీ కొట్టబోతున్నట్టుగా ప్రకటించారు. మెగా కాంపౌండ్ నుంచి ఎంట్రీ ఇచ్చిన పంజా వైష్ణవ్ తేజ్ మొదటి సినిమాతోనే టాలీవుడ్ లో ‘ఉప్పెన’ క్రియేట్ చేశాడు. ఈ బ్లాక్‌బస్టర్ మూవీతో గుర్తుండిపోయే ఎంట్రీ ఇచ్చాడు. ఇది 100 కోట్ల క్లబ్‌లో చేరింది. తరువాత ‘కొండపొలం’ సినిమాతో మరో విజయం అందుకున్నాడు. ప్రస్తుతం వైష్ణవ్ తేజ్, కేతికా శర్మ జంటగా “రంగ రంగ వైభవంగా” అనే రొమాంటిక్ చిత్రం రూపొందుతోంది. ‘ఆదిత్య వర్మ’ ఫేమ్ గిరీశయ్య ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పీ క్రింద బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తుండగా, ‘ఉప్పెన’ ఫేమ్ శామ్‌దత్ సైనుద్దీన్ కెమెరా బాధ్యతలు చేపట్టారు.
Read Also : AdiPurush : ఫారెస్ట్ సీక్వెన్స్ కోసం కోట్లు కుమ్మరిస్తున్న నిర్మాతలు
ఈ చిత్రం మే 27న థియేటర్లలో విడుదలవుతుందని ప్రకటిస్తూ మేకర్స్ సోషల్ మీడియాలో కొత్త పోస్టర్‌ను పంచుకున్నారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అడివి శేష్ ‘మేజర్’తో క్లాష్ కానుంది. ఇక 2008 ముంబై ఉగ్ర దాడుల్లో అమరవీరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా ‘మేజర్’ రూపొందుతోంది. అడివి శేష్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం ముందుగా ఫిబ్రవరి 11న విడుదల కావాల్సి ఉంది. కానీ కోవిడ్-19 ఇన్‌ఫెక్షన్ల పెరుగుదల, థియేటర్ల పనితీరుపై అనిశ్చితి కారణంగా వాయిదా పడింది. “రంగ రంగ వైభవంగా”, “మేజర్” రెండు చిత్రాలూ ఒకేరోజు థియేటర్లలో ఢీకొనబోతున్నాయి.