Ranbir Kapoor: బాలీవుడ్‌పై రణ్‌బీర్ కపూర్ షాకింగ్ కామెంట్స్.. ఏకిపారేశాడుగా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ranbir Kapoor Sensational Comments On Bollywood: ఒకప్పుడు భారత చిత్రసీమ ‘ముఖచిత్రం’గా చెప్పుకునే బాలీవుడ్.. గత కొన్ని సంవత్సరాల నుంచి చెత్త సినిమాలు చేస్తూ వెనుకబడింది. ఎంతసేపటికీ ప్రేమకథాచిత్రాలతోనే కాలం వెళ్లదీస్తోందే తప్ప, ప్రయోగాత్మక చిత్రాల జోలికి వెళ్లట్లేదు. పైగా.. ఈమధ్య ‘అడల్ట్ కంటెంట్’ని మరీ పెంచేసింది. అందుకే.. హిందీ సినిమా మార్కెట్ గణనీయంగా పడిపోయింది. మొన్నటికి మొన్న తన పఠాన్ సినిమాతో షారుఖ్ ఖాన్ కాస్త ఊపిరి పోశాడే తప్ప, అంతకుమించి కొన్నేళ్ల నుంచి బాలీవుడ్ ట్రాక్ రికార్డ్ ఏమంత బాగోలేదు. హిందీ పరిశ్రమ సైతం దక్షిణాది ఇండస్ట్రీపై దృష్టి సారించిందంటే.. అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే.. హిందీ నటీనటులు తమ ఇండస్ట్రీపై విరుచుకుపడుతున్నారు. దక్షిణాది పరిశ్రమను చూసి బుద్ధి తెచ్చుకోవాలని మొట్టికాయలు వేస్తున్నారు. ఇప్పుడు లేటెస్ట్గా రణ్‌బీర్ కపూర్ సైతం ఆ నటుల జాబితాలో చేరిపోయాడు. బాలీవుడ్‌పై షాకింగ్ కామెంట్స్ చేశాడు.
Satellite: అంతరిక్షంలోకి తొలిసారి శాటిలైట్ పంపిన టాప్-10 దేశాలు
Also Read
- Mirzapur The Movie Box Office: జన్మాష్టమి రోజున 'మీర్జాపూర్' కి డబ్బుల వర్షం.. మొదటి రోజు ఎంత రాబట్టిందో తెలిస్తే..
- Nayanthara: స్టార్ హీరోయిన్లో సడెన్ ఛేంజ్.. ఫస్ట్ టైమ్ ఇలా!
- Operation Ganga: మోహన్‌లాల్ కొత్త సినిమాకు టైటిల్ ఫిక్స్.. భారీ తారాగణంతో రాబోతున్న 'ఆపరేషన్ గంగా'
- Toxic English Version: యష్ ‘టాక్సిక్’కు మరో షాక్.. ఇంగ్లీష్ వెర్షన్‌కు సౌండ్ నిల్..
తన అభిమానులతో రణ్‌బీర్ ముచ్చటించినప్పుడు, కేరళకు చెందిన ఒక ఫ్యాన్ ‘హిందీ పరిశ్రమలో ఉన్న లోపం ఏంటి?’ అని ప్రశ్నించాడు. అందుకు రణ్‌బీర్ బదులిస్తూ.. ‘‘గత 15-20 సంవత్సరాల నుంచి పాశ్చాత్త సంస్కృతి, రీమేక్ సినిమాల ప్రభావం వల్ల హిందీ పరిశ్రమ గందరగోళానికి గురవుతోంది’’ అంటూ బాంబ్ పేల్చాడు. అంతేకాదు.. ప్రస్తుతం బాలీవుడ్లో చాలా తక్కువ మంది నటీనటులు ఉన్నారని, కొత్త వారికి (నటీనటులు, దర్శకులకు) ఎలాంటి అవకాశాలు ఇవ్వడం లేదని కుండబద్దలు కొట్టాడు. కొత్తవారికి అవకాశం ఇవ్వడం ఎంతో ముఖ్యమైనదని, ఎందుకంటే వారి వల్లే మార్పు అనేది వస్తుందని సూచించాడు. కొత్త మనుషులు ఇండస్ట్రీలోకి అడుగిడితేనే, కొత్త కథలు వస్తాయని.. అది భవిష్యత్తులోనైనా జరుగుతుందని ఆశిస్తున్నానని అన్నాడు. చాలామంది అవకాశాలు లేకపోవడం వల్ల ఇంట్లోనే ఉండిపోతున్నారని అన్నాడు. కొత్త వారికి ఛాన్స్ ఇస్తే మాత్రం.. బాలీవుడ్ కచ్ఛితంగా పురుడుపోసుకుంటుందని, పూర్వవైభవం పొందుతుందని తాను భావిస్తున్నానని చెప్పుకొచ్చాడు.
Encounter: ఛత్తీస్‌గఢ్‌లో ఎన్కౌంటర్.. ఇద్దరు మావోయిస్టులు మృతి
ఒకరకంగా రణ్‌బీర్ చెప్పింది వాస్తవమే. బాలీవుడ్లో కొత్త వారికి అస్సలు అవకాశాలే రావడం లేదు. కేవలం కొందరు మాత్రమే సినీ పరిశ్రమని నడిపిస్తున్నారు. ఆ శాసిస్తున్న వాళ్లు పాత చింతకాయ పచ్చడి కథల్నే తీస్తున్నారే తప్ప, కొత్త స్టోరీలతో సినిమాలు తీయలేకపోతన్నారు. దీంతో.. బాలీవుడ్ మార్కెట్ పడిపోతోంది. రణ్‌బీర్ చెప్పినట్టు కొత్తవారికి అక్కడ ఛాన్సిస్తే మాత్రం.. బహుశా దాని రూపురేఖలు మారిపోవచ్చేమో! కాగా.. సంజూ తర్వాత ఐదేళ్లు గ్యాప్ తీసుకున్న రణ్‌బీర్, షంషేరా రీఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ‘బ్రహ్మాస్త్ర’ చేసిన ఈ హీరో.. రీసెంట్గా తూ ఝూటీ మై మక్కార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ప్రస్తుతం అతడు సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో ‘అనిమల్’ సినిమా తీస్తున్నాడు.
తాజావార్తలు
-
Mirzapur The Movie Box Office: జన్మాష్టమి రోజున ‘మీర్జాపూర్’ కి డబ్బుల వర్షం.. మొదటి రోజు ఎంత రాబట్టిందో తెలిస్తే..
-
KTR: ‘జాబులు లేవు.. జవాబులు లేవు’.. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర విమర్శలు
-
Pretorius Breaks T20 Record: వైభవ్ సూర్యవంశీ సహచరుడి చరిత్రాత్మక శతకం.. అరుదైన రికార్డు సొంతం
-
Nayanthara: స్టార్ హీరోయిన్లో సడెన్ ఛేంజ్.. ఫస్ట్ టైమ్ ఇలా!
-
Teachers Day Special: ద్రోణాచార్యుడి నుంచి వశిష్ఠుడి వరకు.. దేవతలు సైతం తలవంచిన 10 మంది మహా గురువులు వీరే!
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!