పుష్ప సిరీస్ వల్ల తనకేం ఒరిగింది లేదని అన్న ఫహాద్ ఫజిల్ మళ్లీ ఇటు వైపుగా ప్రయత్నాలు చేసినట్లు కనబడలేదు. ఎనౌన్స్ చేసిన ప్రాజెక్ట్ కూడా ఉందో లేదో క్లారిటీ లేదు. కోలీవుడ్‌లోనూ తన మార్క్ క్రియేట్ చేశాడు. ఇక ఫ్రూవ్ చేసుకోవాల్సింది బాలీవుడ్‌లోనే. గత ఏడాదే బీటౌన్ ఎంట్రీ జరగబోతుందని న్యూస్ స్ప్రెడ్ అయ్యింది. ఇంతియాజ్ ఆలీ దర్శకత్వంలో మూవీ ఉండబోతోందని, త్రిప్తి దిమ్రీ హీరోయిన్ అని టాక్ వచ్చింది. కానీ అఫీషియల్ కన్ఫర్మేషన్ కాలేదు. అయితే నెక్ట్స్ రణబీర్‌తో కొలబరేట్ కాబోతున్నాడని లేటెస్ట్ టాక్.
Also Read : Malaika Arora : మరో ఐటమ్ సాంగ్ తో మలైకా అరోరా మళ్ళీ వస్తోంది
బాలీవుడ్ డైరెక్టర్ శ్రీరామ్ రాఘవన్ ఓ కోర్టు రూమ్ డ్రామాను తెరకెక్కించాలని అనుకుంటున్నాడట. దీని కోసం రణబీర్, ఫహాద్ ఫజిల్‌ను అప్రోచ్ అయినట్లు టాక్. ఇద్దరు పవర్ హౌస్ ఫెర్మామెర్లతో మూవీని తీయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇందుకు యానిమల్ యాక్టర్ యాక్సెప్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఫహాద్ ఫజిల్ నటన గురించి గతంలో రణబీర్, ఆలియా పొగడ్తలతో ముంచేశారు. సో అతడితో వర్క్ చేయాలని చూస్తున్న రణబీర్ ఇదొక మంచి ఆపర్చునిటీలా భావిస్తున్నట్లు సమాచారం. శ్రీరామ్ రాఘవన్ ప్రజెంట్ అమితాబ్ బచ్చన్ మనవడు అగస్త్యా నందాను హీరోగా వెండితెరకు పరిచయం చేసే బాధ్యతను తీసుకున్నాడు. 21 సంవత్సరాల వయసులో దేశం కోసం అమరులైన వీర సైనికుడు అరుణ్ ఖేతర్‌పాల్ నిజ జీవిత కథ ఆధారంగా ఈ వార్ డ్రామా తెరకెక్కిస్తున్నాడు. మేరీ క్రిస్మస్ ప్లాప్ తర్వాత శ్రీరామ్ తెరకెక్కిస్తోన్న ఫిల్మ్ ఇదే. ఒక వేళ రణబీర్- ఫఫాతో ప్రాజెక్ట్ పట్టాలెక్కించాలనుకుంటే ఇద్దరికీ సమానమైన పాత్ర ఇస్తాడా లేదా అనేది చూడాలి.