బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మడాక్. హారర్ కామెడీ చిత్రాలతో భారీ హిట్స్ కొట్టేసి.. వాటికి ఇన్ స్టాల్మెంట్ చిత్రాలను తీసుకు వస్తుంది. స్త్రీతో మొదలైన ఈ యూనివర్శ్.. ప్రజెంట్ థమ దగ్గరకు వచ్చింది. ఇప్పటి వరకు ఫోర్ ఇన్ స్టాల్ మెంట్ మూవీస్ వస్తే వేటికవే సూపర్ డూపర్ హిట్స్. వీటిల్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ స్త్రీ2. నియర్లీ 800 కోట్లను కొల్లగొట్టింది. థమాకు పెద్ద టార్గెట్టే ఇచ్చింది. అయితే ఇప్పటి వరకు ఈ సిరీస్‍లో ఏమున్నా లేకపోయినా ఐటమ్ సాంగ్ ని మాత్రం మిస్ చేయడం లేదు ప్రొడక్షన్ హౌస్. ఇప్పటి నుండో కాదు స్త్రీ నుండి స్పెషల్ సాంగ్ చేయిస్తోంది. స్త్రీలో నోరా ఫతేహీ స్పెషల్ సాంగ్‌లో చిందులేస్తే బేధియాలో మిస్ అయినప్పటికీ శ్రద్ధా ఓ రొమాంటిక్ పాటలో గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చి వెళ్లిపోయింది.
Also Read : Dasari Kiran : సినీ నిర్మాత దాసరి కిరణ్ కుమార్ పై వరుస ఫిర్యాదులు
బేధియాలో మిస్సైంది అనుకుంటే ముంజలో కవర్ చేసేసింది మడాక్. ఆ మూవీ హీరోయిన్ శార్వరితోనే ఐటమ్ సాంగ్ కానిచ్చేసింది. ఫస్ట్ టైం స్పెషల్ సాంగ్ చేసినా సీనియర్లకు ఏమాత్రం తీసిపోలేదు భామ. ఇక స్త్రీలో తమన్నాను తీసుకు వచ్చింది మడాక్ ఫిల్మ్స్. ఆజ్ కీ రాత్ అంటూ హీటెక్కించింది మిల్కీ బ్యూటీ. అంతేకాదు సినిమా అంత బ్లాక్ బస్టర్ హిట్ కావడానికి ఈ సాంగ్ కీ రోల్ ప్లే చేసిందన్న టాక్ వచ్చింది. అందుకే ఈ సారి థమాలో కూడా ఐటమ్ సాంగ్ గట్టిగానే ప్లాన్ చేసింది నిర్మాణ సంస్థ. ఆయుష్మాన్ ఖురానా, రష్మిక మందాన్నకీ రోల్స్ ప్లే చేస్తున్న ఫిల్మ్ థమ. రీసెంట్లీ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో రష్మికతో పాటు మలైకా అరోరా స్టెప్ వేస్తున్న చిన్న క్లిప్ కనిపించింది. దీంతో ఈ హారర్ కామెడీ పిక్చర్‌లో కెవ్వు కేక బ్యూటీ ఐటమ్ సాంగ్‌కు చిందులేయనున్నట్లు క్లారిటీ వచ్చింది. అయితే నేషనల్ క్రష్ కూడా ఈ పాటలో కాలుకదపననుందా లేదా అన్నది మరి కొన్ని రోజుల్లో తేలిపోతుంది. మొత్తానికి ఈ హారర్ కామెడీ యూనివర్శ్‌కు తమ అందచందాలు దారపోస్తూ మూవీ సక్సెస్‌లో హీరోయిన్లతో పాటు ఐటమ్ భామలు కూడా భాగం పంచుకుంటున్నారు.